ఉన్నదంతా తీసుకుంటే మేమెలా బతకాలి

ABN , First Publish Date - 2021-10-29T04:58:14+05:30 IST

‘ఇప్పటికే పరిశ్రమల స్థాపనకు భూములిచ్చాం.. ఇప్పుడు పంట కాలువ కోసమని మళ్లీ భూములివ్వలేం..’ అని రైతులు భూ సర్వేను అడ్డుకున్న ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కొండాపూర్‌లో గురువారం జరిగింది. మనోహరాబాద్‌ మండలం కొండాపూర్‌ శివారులో 191 ఎకరాల అసైన్డ్‌భూమి పరిశ్రమల స్థాపనకు ఇటీవల టీఎ్‌సఐఐసీ సేకరించింది. ఈ భూముల వద్దకు వెళ్లేందుకు 100 అడుగుల వెడల్పుతో రోడ్డు వేసేందుకు రైతుల నుంచి భూమిని తీసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సంగారెడ్డి

ఉన్నదంతా తీసుకుంటే మేమెలా బతకాలి
కొండాపూర్‌లో తహసీల్దార్‌ను నిలదీస్తున్న రైతులు

సర్వేను అడ్డుకున్న మెదక్‌ జిల్లా కొండాపూర్‌ రైతులు

పరిశ్రమలు, రోడ్డు కోసం ఇప్పటికే భూములను తీసుకున్న టీఎస్‌ఐఐసీ

పంట కాలువ నిర్మాణానికి మరోసారి భూసేకరణ


తూప్రాన్‌ (మనోహరాబాద్‌), అక్టోబరు 28: ‘ఇప్పటికే పరిశ్రమల స్థాపనకు భూములిచ్చాం.. ఇప్పుడు పంట కాలువ కోసమని మళ్లీ భూములివ్వలేం..’ అని రైతులు భూ సర్వేను అడ్డుకున్న ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కొండాపూర్‌లో గురువారం జరిగింది. మనోహరాబాద్‌ మండలం కొండాపూర్‌ శివారులో 191 ఎకరాల అసైన్డ్‌భూమి పరిశ్రమల స్థాపనకు ఇటీవల టీఎ్‌సఐఐసీ సేకరించింది. ఈ భూముల వద్దకు వెళ్లేందుకు 100 అడుగుల వెడల్పుతో రోడ్డు వేసేందుకు రైతుల నుంచి భూమిని తీసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సంగారెడ్డి కాలువ నిర్మాణం కోసం మరో 36 ఎకరాల భూమిని భూసేకరించాలని నిర్ణయించారు. భూసర్వే కోసం తహసీల్దార్‌ భిక్షపతి సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకోగా ప్రజలు అడ్డుకున్నారు. ఇప్పటికే దాదాపు రెండొందల ఎకరాలు సాగుభూమిని కోల్పోయామని, మిగిలింది కూడా తీసుకుంటే తామెలా బతకాలని నిలదీశారు. అటవీ భూముల గుండా కాలువను మళ్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రైతులంతా కలిసి తూప్రాన్‌లో ఆర్డీవో శ్యాంప్రకాశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2021-10-29T04:58:14+05:30 IST