Farmers protest: అనంతపురంలో రోడ్లపై టమోటాలు పడేసి రైతుల నిరసన

ABN , First Publish Date - 2022-08-08T18:08:08+05:30 IST

టమోటాలకు గిట్టుబాటు ధర లేదంటూ జిల్లాలోని టవర్ క్లాక్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు.

Farmers protest: అనంతపురంలో రోడ్లపై టమోటాలు పడేసి రైతుల నిరసన

అనంతపురం: టమోటాల(tomatoes)కు గిట్టుబాటు ధర లేదంటూ జిల్లాలోని టవర్ క్లాక్ వద్ద రైతులు(Farmers) ఆందోళనకు దిగారు. రోడ్లపై టమోటాలను పడేసి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకు దిగిన రైతులు, రైతు సంఘం నేతల (Leaders of farmers' association)ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నేత చంద్రశేఖర్ రెడ్డి(Chandrashekar reddy) మాట్లాడుతూ... టమోటా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. గత ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు. టమోటా కిలో ఒక్క రూపాయి కూడా పోవడం లేదని...దీనిపై జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు స్పందించాలన్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకపోతే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు టమోటాలను పోసి ఆందోళనకు దిగుతామని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2022-08-08T18:08:08+05:30 IST