Abn logo
Sep 18 2020 @ 17:10PM

మోదీ మోసాలు రైతులకు తెలుసు: అగ్రి బిల్లుపై రాహుల్

Kaakateeya

న్యూఢిల్లీ: మోదీ చేస్తున్న మోసాలు రైతులకు కాబట్టే వ్యవసాయ బిల్లులను వారు వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వంపై రైతులకు ఏమాత్రం విశ్వాసం లేదని, అది గతంలో అనేక సార్లు నిరూపితం అయిందని ఆయన అన్నారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు.


‘‘మోదీ ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం ఏమాత్రం లేదు. ఎందుకంటే మోదీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. నోట్లరద్దు, తప్పుడు జీఎస్టీ, డీజిల్ ధరలు ఇష్టారీతిన పెంచడం లాంటి అనుభవాలు వారికున్నాయి. ఇప్పుడు తెస్తున్న వ్యవసాయ బిల్లుల ద్వారా తన మిత్రులైన వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చేది. రైతుల జీవనోపాధిపై దాడి చేసేంది. అందుకే రైతులు ఏకమయ్యారు’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.


పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు మూడు అగ్రి బిల్లులను ఆమోదింపజేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఓవైపు సన్నాహాలు చేస్తోంది. అయితే దీనిపై రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. ముఖ్యంగా దేశ రాజధానికి సరిహద్దు రాష్ట్రాలైనా పంజాబ్, హర్యానా రైతులు కొద్ది రోజులు ఉదృతంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన అకాళీదళ్ నేత హర్‌ సిమ్రత్ కౌర్ ప్రభుత్వం నుంచి గురువారం వైదొలగారు.

Advertisement
Advertisement
Advertisement