Abn logo
Sep 12 2021 @ 02:32AM

అప్పుల్లో అన్నదాతలు

50% రైతు కుటుంబాల సరాసరి రుణం రూ.74 వేలు

జాతీయ గణాంక కార్యాలయం సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: దేశంలోని అన్నదాతల కుటుంబాలు అప్పుల్లో అలమటిస్తున్నాయి. జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌వో) సర్వే ప్రకారం.. 50ు కుటుంబాల్లో సరాసరి రూ.74,121 చొప్పున అప్పు ఉంది. వీరిలో 69.6ు మంది బ్యాంకులు, కోపరేటివ్‌ సొసైటీలు, ప్రభుత్వ సంస్థల నుంచి రుణాలు తీసుకోగా, 20.5% మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకున్నారు. వ్యవసాయ అవసరాల కోసం 57.5% రైతు కుటుంబాలు అప్పులు తీసుకున్నారు. 2019, జనవరి- డిసెంబరు మధ్య అన్ని గ్రామాల్లో సర్వే చేపట్టినట్టు ఎన్‌ఎ్‌సవో పేర్కొంది. 2018-19లో వ్యవసాయ రంగంలో ఉన్న వారి నెలవారీ ఆదాయం రూ.10,218 మాత్రమే ఉంది. వేతనాల రూపంలో రూ.4,063, పంట ఉత్పత్తు ల ద్వారా రూ.3,798, పశుపోషణ ద్వారా రూ.1,582, వ్యవసాయేతర ఆదా యం రూ.641, భూముల లీజు ద్వారా రూ.134 లభించినట్టు సర్వే వివరించింది.


ఓబీసీలే అధికం

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఉన్న సామాజిక వర్గాల వివరాలను కూడా ఎన్‌ఎ్‌సవో సర్వే వెల్లడించింది. 9.3 కోట్ల మంది వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తుండగా.. వీరిలో 45.8% మంది ఓబీసీ, 15.9% మంది ఎస్సీ, 14.2% మంది ఎస్టీ, 24.1% మంది ఇతరులు ఉన్నారు. గ్రామాల్లో ఉంటున్న వ్యవసాయేతర రంగానికి చెందిన వారు 7.93 కోట్ల మంది ఉన్నారు. గ్రామాల్లోని 83.5% మందికి హెక్టారుకన్నా తక్కువగానే సాగు భూమి ఉండగా, 0.2% మందికే 10 హెక్టారులకన్నా ఎక్కువ భూమి ఉన్నట్టు తేలింది. 


గ్రామీణ భారతం రుణమయం

దేశంలోని గ్రామీణుల్లో 35ు మంది అప్పుల్లో ఉన్నట్లు ఎన్‌ఎస్‌వో సర్వే తెలి పింది. వీరిలో 40.3% మంది వ్యవసా య కుటుంబాలకు చెందినవారు కాగా, 28.2% మంది వ్యవసాయేతర కుటుంబాలకు చెందిన వారు. ఇక, పట్టణాల్లో 22.4% మంది మాత్రమే అప్పుల్లో ఉన్నా రు. వీరిలో 27.5% స్వయం ఉపాధి పొందుతున్నవారు, 20.6% మంది ఇతరులు ఉన్నారు. 


ప్రైవేటు వ్యాపారుల హవా!

గ్రామాల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల హవా ఎక్కువగా ఉందని సర్వే తెలిపింది. గ్రామీణుల్లో 34% మంది ప్రైవే టు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నా రు. 66% మంది బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఇక, పట్టణాల్లో 87% మంది బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి రుణాలు తీసుకుంటుండగా, 13% మంది మాత్రమే ప్రైవేటు వ్యాపారుల నుంచి అప్పు తీసుకుంటున్నారు.