‘కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతులకు ప్రయోజనాలు’

ABN , First Publish Date - 2020-05-20T11:16:58+05:30 IST

రైతు ప్రయోజనాలు కాపాడడానికి సర్కారు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌ అన్నారు. మంగళవారం ఇంద్రవెల్లిలో

‘కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతులకు ప్రయోజనాలు’

ఉట్నూర్‌, మే 19: రైతు ప్రయోజనాలు కాపాడడానికి సర్కారు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌ అన్నారు. మంగళవారం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ ఉన్నా పంటలకు మద్దతు ధరల ను ప్రకటించి సర్కారు కొనుగోలు చేసిందని తెలిపారు.


ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టాభూములు లేని గిరిజనేతర రైతులకు పంట రుణాలు అందించడానికి డీసీసీబీ బ్యాంక్‌ ద్వారా రూ.వంద కోట్లను ప్రభుత్వం అందించిందన్నారు. రూ.80 కోట్లు రైతు సంఘాలకు పంపిణీ చేయడంతో పాటు రూ.20 కోట్లు బంగా రు తాకట్టు రుణాలకు కేటాయించారని తెలిపారు. పట్టాభూములు లేని ఐదుగురు రైతులు కలిసి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పహాణీ, ఆధార్‌, నోడ్యూస్‌, ఫొటో సంఘానికి అందజేస్తే సంఘ సభ్యుల పేరుతో లక్ష రూపాయల రుణం మంజూరు చేస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2020-05-20T11:16:58+05:30 IST