గడివేముల సబ్ స్టేషన ఎదుట ఆందోళన.. అధికారుల హామీతో విరమణ
గడివేముల విద్యుత సబ్‌స్టేషన వద్ద ఆదివారం రాత్రి ఆందోళన చేస్తున్న రైతులు
గడివేముల, జనవరి 23: పగటి పూట వ్యవసాయ బోరుబావులకు విద్యుత సరఫరా చేయాలని రైతులు ఆదివారం రాత్రి గడివేముల సబ్‌స్టేషన వద్ద ఆందోళనకు దిగారు. ఎ.గ్రూపు ఫీడర్‌కు అర్ధరాత్రి 12 నుంచి (సోమవారం) నుంచి ఉదయం 9 గంటల వరకు విద్యుత సరఫరా చేస్తామని అధికారులు గ్రూపులో మెసేజ్ పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫీడర్‌లో ఉన్న గడివేముల, కొరపొలూరు, సోమాపురం, బిలకలగూడురు గ్రామాల్లో మిర్చి, మొక్కజొన్న, పత్తి, మినుము పంటలు సాగు చేశామన్నారు. అర్ధరాత్రి విద్యుత ఇస్తే తీవ్ర ఇబ్బందులు పడతామన్నారు. పగటి పూట విద్యుత సరఫరా చేయాలని కోరారు. పగటి పూట కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చేంత వరకు రైతులు ధర్నాను కొనసాగించారు. విద్యుత ఏఈ రంగరాజు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు సోమవారం వేకువ జామున 3 నుంచి విద్యుత సరఫరా చేస్తామని రైతులకు తెలిపారు. సోమవారం ఉన్నతాధికారులు రైతులతో చర్చించి మంగళవారం నుంచి విద్యుత సరఫరా వేళలను నిర్ణయిస్తామని తెలిపారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు.