దసరా నాటికి రైతువేదికలు..

ABN , First Publish Date - 2020-08-05T09:29:36+05:30 IST

దసరా నాటికి రైతు వేదిక భవనాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

దసరా నాటికి రైతువేదికలు..

రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి 


పరిగి(రూరల్‌)/ చేవెళ్ల/ మొయినాబాద్‌: దసరా నాటికి రైతు వేదిక భవనాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా పరిగి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. గడిసింగాపూర్‌ గ్రామంలో రైతువేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పంటలను పరిశీలించారు. రైతుబందు వచ్చిందా.? అని అడిగారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జి.అశోక్‌రెడ్డి, జడ్పీటీసీ బి.హరిప్రియారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కె.శ్యాంసుందర్‌రెడ్డి, రాజేందర్‌, వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీటీసీ పద్మమ్మ, జి.శ్రీనివా్‌సరెడ్డి, స్రవంతి, తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుందా అశోక్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌, నాయకులు ఆర్‌.ఆంజనేయులు, సురేందర్‌కుమార్‌, ప్రవీణ్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఫర్టిలైజర్‌ యజమానులు అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారని రైతులు రాజేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఏడీఏ వీరప్పపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మహే్‌షరెడ్డిని ఆదేశించారు. సాలిపూలబాట తండాకు చెందిన రుక్కమ్మ అనే రైతుకు కొత్త పట్టాబుక్కు ఉన్నా రైతుబంధు రాలేదని తెలిపింది.  అందరికీ పాసుబుక్కులు వచ్చేలా చూడాలని తహసీల్దార్‌ విద్యాసాగర్‌ను ఆదేశించారు. అనంతరం పరిగి మండలం రంగంపల్లి శివారుల్లో వరినాట్లు వేసిన మడుల గట్లపై నడిచి వెళ్లి రైతుల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మొయినాబాద్‌ మండలాల్లోని ఇబ్రహీంపల్లి, చిన్నషాపూర్‌ గ్రామాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి పర్యటించారు. పంటలు, పూల తోటలను పరిశీలించారు. 

Updated Date - 2020-08-05T09:29:36+05:30 IST