న్యూఢిల్లీ: పెండింగ్లో ఉన్న రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రైతు సంఘాలు అంగీకారం తెలిపాయి. గురువారం మద్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఈ విషయమై చర్చలు జరగనున్నాయి. ఐదుగురు సభ్యులు ఉన్న సంయుక్త కిసాన్ మోర్చాకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం అన్ని వివరాలతో కూడిన ఒక ముసాయిదాను పంపింది.
కనీస మద్దతు ధర, ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు 2020/2021 ని ఉపసంహరించుకోవడం, రైతులపై పెట్టిన క్రిమినల్ కేసులను ఎత్తివేయడం, చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం సహా ఇతర రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరగనున్నాయి. మంగళవారం సాయంత్రం ఈ విషయమై సింఘు సరిహద్దులో రైతు సంఘాల అధినేతు సమావేశమై చర్చించారు. అయితే ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. రైతు ఆందోళనను విరమేందుకు సంయుక్త కిసాన్ మోర్చా సముకత తెలిపినట్లు సమాచారం. అయితే బుధవారం ప్రభుత్వంతో చర్చల అనంతరం దీనిపై క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.