Abn logo
Jun 5 2020 @ 05:08AM

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

వీరపునాయునిపల్లె, జూన్‌ 4: మండలంలోని కొమ్మద్ది గ్రామంలో రామిరెడ్డి ఓబుళరెడ్డి (52) అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కొమ్మద్ది గ్రామానికి చెందిన ఓబుళరెడ్డి వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయంలో సరైన దిగుబడులు రాక, గిట్టుబాటు ధరల్లేక అప్పులు పాలయ్యాడు. దీంతో కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఓబుళరెడ్డి గురువారం తెల్లవారుజామున తన పొలానికి సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement