కలల సాగు.. కన్నీటి పాలు

ABN , First Publish Date - 2020-10-21T18:25:49+05:30 IST

ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంటను అన్నదాత... తన కళ్ళెదుటే పంటను దున్నించేశాడు. పంట బాగా వస్తుందని ఆశించిన..

కలల సాగు.. కన్నీటి పాలు

అనంతపురం: ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంటను అన్నదాత... తన కళ్ళెదుటే పంటను దున్నించేశాడు. పంట బాగా వస్తుందని ఆశించిన రైతన్నకు ఆశాభంగం ఎదురైంది. కన్నబిడ్డల పెళ్లిళ్లు, పిల్లల చదువులు, అప్పులు తీర్చేయాలి.. ఇలా ఎన్నో కలలు కన్న రైతన్నకు ఈ ఏడాది కన్నీరే మిగిలింది తప్పా పంట ఏమాత్రం దక్కలేదు. అధికంగా కురిసిన వర్షాలతో అప్పులు చేసి సాగు చేసిన పంట ఏమాత్రం పనికి రాకుండా పోతోంది. కనీసం పశుగ్రాసానికి కూడా దక్కకుండాపోయింది. దీంతో అన్నదాతలు పంటను రొటావేటర్‌తో దున్నేస్తున్నారు. అనంతపురం రూరల్‌ మండలంలోని చియ్యేడు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే రైతు తనకున్న 4ఎకరాల్లో రూ.70వేలతో వేరుశనగ పంటసాగు చేశాడు. వరుస వర్షాలతో చెట్టుకు ఉన్న కాయలన్నీ కుళ్లిపోయాయి. అసలు పశుగ్రాసానికి కూడా పనికిరాకుండా పోయింది. దీంతో చెమర్చిన్న కళ్లతో ట్రాక్టర్‌ ద్వారా పంట మొత్తాన్ని దున్నించేశాడు. ఒక్క లక్ష్మీనారాయణదే ఈ సమస్య కాదు.. ఈ ప్రాంతంలోని రైతులందరిదీ ఇదే పరిస్థితి.

Updated Date - 2020-10-21T18:25:49+05:30 IST