పక్కా గృహాలకు నోచుకోని కుటుంబాలు

ABN , First Publish Date - 2022-08-20T05:27:03+05:30 IST

మండలపరిధిలోని బొంతపల్లి వద్ద 30యేళ్లుగా ఒకే చోట నివాసమున్న పూసల వ్యాపారులు పక్కా గృహాలకు ఇప్పటివరకు నోచుకోలేదు.

పక్కా గృహాలకు నోచుకోని కుటుంబాలు
డేరాల్లో నివాసమున్న పూసల వ్యాపారులు


30 ఏళ్లుగా డేరాలు, గుడిసెల్లోనే...

తనకల్లు, ఆగస్టు 18: రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే నవరత్నాల్లో భాగంగా నిరుపేదలందరికీ జగనన్న కాలనీల పేరుతో పక్కాగృహాలు మంజూరు చేసి, ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి అయినా ఇంతవరకు మండలంలో ఒక పక్కా గృహం మంజూరు చేసిన పాపాన పోలేదు. మండలంలోని పలు గ్రామాల్లో జగనన్న కాల నీల పేరుతో ప్రభుత్వ భూములను ఎక్స్‌కవేటర్లతో చదును చేసి, పట్టా లు మంజూరు చేశారు. ఇదిలా ఉండగా మండలపరిధిలోని బొంతపల్లి వద్ద 30యేళ్లుగా ఒకే చోట నివాసమున్న పూసల వ్యాపారులు పక్కా గృహాలకు ఇప్పటివరకు నోచుకోలేదు. వారికి ఏ ప్రభుత్వం కూడా కనీసం జానెడు స్థలం ఇవ్వ లేకపోయింది. గ్రామం సమీపంలో పూసలు, చిన్నచి తకా వ్యాపారలు చేసుకుని 20 కుటుంబాల వారు జీవనం సాగిస్తు న్నారు. వారు సొంతంగా కొనుగోలు చేసిన భూమికి ఏర్పాటు చేసుకున్న హద్దుల మేరకు పొసెషన సర్టిఫి కెట్లు మంజూరు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. తమతో ఓట్లు వేయించుకుంటున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో 30యేళ్లుగా తాము గుడారాల్లోనే నివాసాలుండాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిమార్లు తమ సమస్యను అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పుకు న్నా ప్రయోజనం లేదన్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే ప్రతి ఒక్కరికి తమగొడు చెప్పుకుంటున్నామని, అయినా ఏ ఒక్కరు స్పందించ లేదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అఽధికారులు, ప్ర.జాప్రతిని ధులు స్పందించి పక్కా గృహలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 ప్రభుత్వం ఆదేశిస్తే... మంజూరు పత్రాలు అందిస్తాం..- జగదీష్‌, గృహనిర్మాణ శాఖ వర్క్‌ ఇనస్పెక్టర్‌ 

ప్రభుత్వం మొదటి విడతలో తనకల్లు మండలానికి పక్కాగృహాలు మంజూరు చేయలేదు. రెండో విడతలో ప్రభుత్వ ఆదేశాలిస్తే వారందరికి అనుమతి పత్రాలు మంజూరు చేస్తాం.  


Updated Date - 2022-08-20T05:27:03+05:30 IST