కరోనా పరీక్షలు చేయడంలో విఫలం : వామపక్షాలు

ABN , First Publish Date - 2020-08-15T10:51:17+05:30 IST

కరోనా పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వామపక్ష నాయకులు ఆరోపించారు.

కరోనా పరీక్షలు చేయడంలో విఫలం : వామపక్షాలు

సూర్యాపేటటౌన్‌/మఠంపల్లి /హుజూర్‌నగర్‌/మేళ్లచెర్వు, ఆగస్టు 14 : కరోనా పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వామపక్ష నాయకులు ఆరోపించారు. జిల్లా కేంద్రంతో పాటు మఠంపల్లి, హుజూర్‌నగర్‌లలో జరిగిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ మండలకేంద్రాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య చికిత్సలు అందజేయాలన్నారు.


ఆయా సమావేశాల్లో సీపీఎం జిల్లా కార్యదర్శి  మల్లు నాగార్జున్‌రెడ్డి, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌ కుమార్‌, సీపీఐ జిల్లా నాయకులు దంతాల రాంబాబు, ముల్కలపల్లి రాములు,  మట్టిపెల్లి సైదులు, మఠంపల్లిలో భూక్య పాండునాయక్‌, మాలోతుబాలునాయక్‌, వినోద్‌నాయక్‌, కంటుకోటయ్య, నాగేశ్వరావు, హుజూర్‌నగర్‌లో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ములకలపల్లి సీతయ్య, శీతల రోషపతి, పల్లె వెంకటరెడ్డి, వీరస్వామి, దుర్గారావు, ముత్తమ్మ  సైదులు, వెంకన్న పాల్గొన్నారు. కరోనా వైరస్‌ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని టీడీపీ పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కందుల సురేష్‌ ప్రభుత్వాన్ని కోరారు. మేళ్లచెర్వులో విలేకరులతో మాట్లాడారు.

Updated Date - 2020-08-15T10:51:17+05:30 IST