టమోటా రైతును ఆదుకోవడంలో విఫలం

ABN , First Publish Date - 2022-08-12T05:46:40+05:30 IST

టమోటా రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వారిని ఆదుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు.

టమోటా రైతును ఆదుకోవడంలో విఫలం
హైవే సమీపంలో పారబోసిన టమోటాను పరిశీలిస్తున్న టీడీపీ జిల్లా నాయకులు

రైతు ద్రోహి జగనమోహనరెడ్డి

ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు ఏదీ?

ఎకరానికి రూ.25వేలు సాయం అందించాలి

అన్నదాతల బాధలు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

టమోటా మార్కెట్‌ను 

పరిశీలించిన టీడీపీ నాయకులు 


  అనంతపురం రూరల్‌, ఆగస్టు 11: టమోటా రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వారిని ఆదుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. గురువారం ఆయన  మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, కళ్యాణదుర్గం ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు తదితరులతో కలిసి కక్కలపల్లి టమోటా మార్కెట్‌ను సందర్శించారు. ఈసందర్భంగా పంట సాగుకు అయిన పెట్టుబడి, కూలి, రవాణా ఖర్చు ఇతరత్ర వాటిని మార్కెట్‌లోని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 15కి లోల బాక్సు రూ.60తో పలికినట్లు రైతులు చెబుతున్నారు. రెండురోజుల కిందట రూ.30 పలికాయి. ఈ ధరలతో రైతులకు పెట్టుబడులు కాదు కదా..కూలీల ఖర్చులు కూడా రావడం గగనంగా మారిందన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతా ల నుంచి ఒక బాక్సు రవాణా చేయడానికి రూ.30 ఖర్చు అవుతోందని రైతులంటున్నారు. ధరలేకపోవడంతో, వ్యాపా రులు పంటను కొనకపోవడంతో వెనక్కు తీసుకెళ్లలేక  రోడ్లపై పారబోసి కన్నీళ్లతో రైతులు ఇళ్లకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారు లు టమోటా రైతుల బాధలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతులకు ఎకరాకు కనీసం రూ.25వేలు సాయం అందించాలన్నారు. సబ్సిడీతో మల్చింగ్‌ షీట్లు ఇవ్వాలన్నారు.  టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుకు ఎక్కడ ప్రాసెస్‌ చేశావో చెప్పాలని సీఎం జగనను డిమాండ్‌ చేశారు.  రైతు ద్రోహి జగనమోహన రెడ్డి అని విమర్శించారు. రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. వారి పక్షాన పోరాటం చేస్తాం. రైతులు, రైతు సంఘాల సమన్వయంతో కార్యచరణ రూపొందించి ఉద్యమాలకు దిగుతామన్నారు. కళ్యాణదుర్గం ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ టమోటాకు గిట్టుబాటు ధరలేకపోవడంతో రైతులు రోడ్లపై పారబోస్తున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీకి చెందిన 12మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలున్నా రైతులు  సచ్చినారా..బతికినారా అని చూసే ఓపిక కూడా వారికి లేదన్నారు.  అనంతరం హైదరాబాదు-బెంగళూరు హైవే పక్కన పడివేసిన టమోటాను పరిశీలించారు. ఈకార్య క్రమంలో రాష్ట్ర కార్యదర్శులు ఆదినారాయణ, దేవళ్ల మురళి, బుగ్గయ్య చౌద రి, జేఎల్‌ మురళీధర్‌, జకీవుల్లా, జిల్లా అధికారప్రతినిధి సరిపూటి రమణ, వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కూచి హరి, శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసనాయుడు, మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి, తెలుగు మహిళా అధ్యక్షురాలు మదమంచి స్వరూప, గాండ్ల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ విశాలాక్షి, తెలుగు రైతు రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు కేశవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యుగంధర్‌, ఉన్నం మారుతిచౌదరి, వెంకటేశ్వరనాయుడు, రఘునాథ్‌, శ్రీనివాసరెడ్డి, రాయల్‌ మురళి, నారాయణస్వామి,  వెంకటప్ప, సుధాకర్‌ యాదవ్‌,రాంబాబు, మోహనకృష్ణ, శ్రీకాంత, లక్ష్మీనరసింహా, ధనుంజయనాయు డు, మణికంఠబాబు, గంగవరం బుజ్జి, శ్రీకాంత, సున్నం శ్రీనివాసులు, వన్నూర్‌, షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-12T05:46:40+05:30 IST