ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న విద్యార్థులు
విద్యార్థుల ధర్నా
మార్కాపురం(వన్‌టౌన్), జనవరి 24: మార్కాపురంలోని ఎస్‌వీకేపీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులను వెనిక్కి పిలిపించి పాఠాలు చెప్పిం చాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సోమ వారం కళాశాల విద్యార్థులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాల ల్లోని అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని జీవో-42 ప్రకారం వివిధ కళాశా లలకు బదిలీ చేసిందని ఫలితంగా తమ పరిస్థితి అగమ్య గోచరంగా త యారైందన్నారు. వెంటనే సిబ్బందిని మార్కాపురం కళాశాలకు కేటాయించి ఈ కళాశాలలో నాన్ టీచింగ్ మాత్రమే జాయిన్ అయ్యారని టీచింగ్ స్టాఫ్ రాకపోవటంతో పాఠాలు చెప్పేవారు లేరన్నారు. అనంతరం ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఇ మ్మానియేలు, ఆజాద్, లోకేష్, సీపీఎం నాయకులు సోమయ్య, జేవీవీ నా యకులు వై.రవికుమార్ పాల్గొన్నారు.