వారానికి ఒకసారి ఈ ఫేసియల్ వేసుకుంటే నిగారింపు మీ సొంతం!

ABN , First Publish Date - 2022-03-17T17:36:40+05:30 IST

ప్యాషన్‌ ఫ్రూట్‌లో బీటా కెరోటిన్‌ సమృద్ధిగా లభిస్తుంది. సెన్సిటివ్‌ స్కిన్‌ కలవారికి ఇది బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్‌ ఎ, సి,

వారానికి ఒకసారి ఈ ఫేసియల్ వేసుకుంటే నిగారింపు మీ సొంతం!

ఆంధ్రజ్యోతి(17-03-2022)

ప్యాషన్‌ ఫ్రూట్‌లో బీటా కెరోటిన్‌ సమృద్ధిగా లభిస్తుంది. సెన్సిటివ్‌ స్కిన్‌ కలవారికి ఇది బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్‌ ఎ, సి, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఈ ఫలంతో పాటు చాక్లెట్‌ను కలిపి ఫేసియల్‌గా ఉపయోగించడం ద్వారా రెట్టింపు ఫలితాలను పొందొచ్చు. ప్యాషన్‌ ఫ్రూట్‌ గుజ్జును తీసుకుని మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టుకు చాక్లెట్‌ను కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ ఫేసియల్‌ వల్ల ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. ముఖంలో తాజాదనం వస్తుంది. వారానికి ఒకసారి ఈ ఫేసియల్‌ను వేసుకున్నా మంచి ఫలితాలు అందుతాయి. 

Updated Date - 2022-03-17T17:36:40+05:30 IST