తాలిబన్లకు ఫేస్‌బుక్ షాక్..!

ABN , First Publish Date - 2021-08-17T20:49:40+05:30 IST

తాలిబన్లకు సంబంధించిన అన్ని ఫేస్‌బుక్ అకౌంట్లను తొలగించినట్టు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా ప్రకటించింది.

తాలిబన్లకు ఫేస్‌బుక్ షాక్..!

వాషింగ్టన్: తాలిబన్లకు సంబంధించిన ఏ సమాచారానికి తమ వేదికలో స్థానం లేదని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా ప్రకటించింది. తమ సేవలు వినియోగించుకునే అవకాశం లేకుండా తాలిబన్లపై నిషేధం విధించినట్టు పేర్కొంది. వారికి సంబంధించిన అకౌంట్లను తొలగించింది. అమెరికా ప్రభుత్వం వారిని ఉగ్రవాదులుగా పేర్కొన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాకుండా.. ఫేస్‌బుక్‌లో తాలిబన్లకు సంబంధించిన సమాచారంపై భవిష్యత్తులోనూ ఓ కన్నేసి ఉంచేందుకు వీలుగా ఫేస్‌బుక్ ఓ ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసింది. అఫ్ఘానీ భాషలైన డారీ, పాష్తోలలో ప్రావీణ్యం ఉన్న స్థానికులు ఈ టీంలో సభ్యులు. స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహన ఉన్న వీరు..ఫేస్‌బుక్‌లో తాలిబన్లకు సంబంధించిన సమాచారం కోసం జల్లెడపడుతూ..ఫేస్‌బుక్ యాజమాన్యాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తారు.

Updated Date - 2021-08-17T20:49:40+05:30 IST