Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెరకు రైతుల ఆందోళనపై విస్తృత ప్రచారం


నాతవరం, డిసెంబరు 2 : చెరకు రైతులు, కార్మికులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం పాయకరావుపేట తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద చేపట్టనున్న నిరసన దీక్షకు రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని  రైతు సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం నాతవరంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సాపిరెడ్డి నారాయణమూర్తి మాట్లాడుతూ ఫ్యాక్టరీకి చెరకు సరాఫరా చేసిన రైతులకు రూ.8.6 కోట్లు, కార్మికులకు పదహారు నెలల వేతన బకాయిలు రూ.8 కోట్లను వెంటనే చెల్లించాలని కోరారు. రానున్న సీజన్‌కి క్రషింగ్‌ నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని రైతులంతా అడ్డు కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిటికెల రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement