ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు

ABN , First Publish Date - 2020-02-20T09:49:48+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థల కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు రెండో రోజు కొనసాగాయి.

ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు

భవన నిర్మాణ పనుల్లో అవకతవ కల గుర్తింపు


నెల్లూరు (క్రైం), ఫిబ్రవరి 19 : రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థల కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు రెండో రోజు కొనసాగాయి. బుధవారం ఏసీబీ  డీఎస్సీ దేవానంద్‌ శాంతో ఆధ్వర్యంలో నగరంలోని పలు భవనాలు పరిశీలించారు. ఈ పరిశీలనలో  పలు అక్రమాలు అధికారుల దృష్టికి వచ్చాయి. రామ్‌నగర్‌ ప్రాంతంలోని జీ ప్లస్‌  3 భవనానికి ఎటువంటి ప్లాను లేదని, ఆదిత్యనగర్‌లో జీ ప్లస్‌ 3 భవనానికి సరైన అనుమతి లేదని, రామలింగాపురం మెయిన్‌రోడ్డు, కొండాయపాళెం గేటు ఇలా పలు ప్రాంతాలలో నిర్మిస్తున్న భవనాలకు సరైన అనుమతులు లేవని గుర్తించారు. ఈ తనిఖీలు గురువారం కూడా కొనసాగనున్నాయని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-02-20T09:49:48+05:30 IST