ఉపకార వేతనాలకు దరఖాస్తుల గడవు పొడగింపు

ABN , First Publish Date - 2021-12-04T05:09:31+05:30 IST

జిల్లాలో మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రీమెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌, మెరిట్‌ కం మీన్స్‌, బెస్ట్‌ ఉపకారవేతనాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల గడవు పెంచిందని అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి జగదీష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉపకార వేతనాలకు  దరఖాస్తుల గడవు పొడగింపు

మెదక్‌ రూరల్‌, డిసెంబరు 3: జిల్లాలో మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రీమెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌, మెరిట్‌ కం మీన్స్‌, బెస్ట్‌ ఉపకారవేతనాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల గడవు పెంచిందని అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి జగదీష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలకై, ఇంటర్మిడియట్‌ నుంచి పీహెచ్‌డీ, ఐటీఐ, ఐటీసీ వంటి సాంకేతిక కోర్సులు చదువుతున్న విద్యార్థులు పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాలకు యూజీపీజీ టెక్నికల్‌, ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు మెరిట్‌ కం మీన్స్‌ ఉపకార వేతనాలకు ఈ నెల 15 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-12-04T05:09:31+05:30 IST