పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల పునరుద్ధరణ

ABN , First Publish Date - 2021-04-21T18:29:02+05:30 IST

‘విల్లుపురం - పురులియా - విల్లుపురం’ బైవీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ప్రత్యేక రైలు(06170/06169) తేదీలను పునరుద్ధరించారు

పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల పునరుద్ధరణ



చెన్నై: ‘విల్లుపురం - పురులియా - విల్లుపురం’ బైవీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ప్రత్యేక రైలు(06170/06169) తేదీలను పునరుద్ధరించారు. 06170 నెంబరు గల రైలు ప్రతి వారం బుధ, శనివారాల్లో విల్లుపురంలో బయలుదేరుతుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 12.05 గంటలకు విల్లు పురంలో బయలుదేరుతుంది. అదేవిధంగా 06169 నెంబరు గల రైలు ప్రతి శుక్ర, సోమవారాల్లో పురులియా లో బయలుదేరుతుంది. ఈ రైలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రతి రోజూ సాయంత్రం 7 గంటలకు పురులియాలో బయలుదేరుతుంది. ఈ రైళ్లు విల్లుపురం, తిరువణ్ణామలై, వేలూరు కెంట్‌, కాట్పాడి, తిరుత్తణి, పుత్తూరు, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, బర్హంపూర్‌, ఖుర్దారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, జాజ్‌పూర్‌ కె రోడ్‌, బాలాసోర్‌, జలేశ్వర్‌, బెల్డా, హిజిలి, మిడ్నాపూర్‌, బిష్ణుపూర్‌, బంకుర, అద్ర మీదుగా పురూలియా వెళ్తుంది


ఖరగ్‌పూర్‌కు..

విల్లుపురం - ఖరగ్‌పూర్‌ (06178) వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 27వ తేదీ నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12.05 గంటలకు బయలు దేరుతుంది. ఖరగ్‌పూర్‌ - విల్లుపురం వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ (06177) ఈ నెల 29వ తేదీ నుంచి ప్రతి గురువారం సాయంత్రం 7 గంటలకు బయలుదేరు తుంది.  ఈ రైలు విల్లుపురం, తిరువణ్ణామలై, వేలూరు కెంట్‌, కాట్పాడి, రేణిగుంట, గూడూర్‌, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, బర్హంపూర్‌, ఖుర్దా రోడ్‌లలో ఆగుతుంది. 


Updated Date - 2021-04-21T18:29:02+05:30 IST