chennai: ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 7 వేల మంది రిజర్వేషన్‌

ABN , First Publish Date - 2021-10-13T13:02:51+05:30 IST

దీపావళి పండుగను జరుపుకొనేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థలు నడిపే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు సుమారు 7 వేల మంది రిజర్వేషన్‌ చేసు కున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర

chennai: ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 7 వేల మంది రిజర్వేషన్‌

ప్యారీస్‌(చెన్నై): దీపావళి పండుగను జరుపుకొనేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థలు నడిపే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు సుమారు 7 వేల మంది రిజర్వేషన్‌ చేసుకున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాజ కన్నప్పన్‌ జారీచేసిన ఉత్తర్వుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల రిజర్వేషన్‌ ప్రారంభమైంది. స్థానిక కోయంబేడు, తాంబరం సహా తిరువళ్లూర్‌, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, తిరువణ్ణామలై జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ రవాణా సంస్థ ప్రధాన కార్యాలయాల్లో టిక్కెట్ల రిజర్వేషన్‌ కౌంటర్ల వద్ద రద్దీ నెలకొంది. దీనిపై స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇళంగోవన్‌ మీడియాతో మాట్లాడుతూ, దీపావళి పండుగ కోసం నవంబరు 2వ తేదీ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు 4 వేల మంది, 3వ తేదీకి 3 వేల మంది అని, సోమ, మంగళవారాల్లో మొత్తం 7 వేల మంది రిజర్వేషన్‌ చేయించుకున్నారని తెలిపారు. ప్రభుత్వ కరోనా నిబంధనలు అనుసరిస్తూ దూరప్రాంతాలకు నడిపే బస్సుల్లో 50 శాతం సీట్లు మాత్రమే రిజర్వేషన్‌ చేసుకొనే అవకాశం కల్పించామన్నారు. కరోనా లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందు వల్ల గతంలో లాగా కౌంటర్లకు నేరుగా వెళ్లి రిజర్వేషన్‌ టిక్కెట్లు తీసుకొనే వారి సంఖ్య తగ్గిందని, 75 శాతం మంది ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్లు రిజర్వేషన్‌ చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.

Updated Date - 2021-10-13T13:02:51+05:30 IST