ఇంత ఖరీదైన నీటిని ఎక్కడా చూసుండరు... ఒక్క బాటిల్ ఖరీదు ఎంతంటే...

ABN , First Publish Date - 2022-02-23T16:12:22+05:30 IST

ఒక రోజులో మీరు చాలా గ్లాసుల నీటిని తాగుతారు.

ఇంత ఖరీదైన నీటిని ఎక్కడా చూసుండరు... ఒక్క బాటిల్ ఖరీదు ఎంతంటే...

ఒక రోజులో మీరు చాలా గ్లాసుల నీటిని తాగుతారు. అందుకే మీరు నీటి ఖర్చును అంతగా పట్టించుకోకపోయివుండవచ్చు. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీరు కూడా ఉంది. ఆ నీటిని మీరు తాగాలనుకుంటే మీ జేబు గుల్లవుతుంది.  ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీరుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Acqua di Cristallo Tributo a Modigliani అనే ఈ నీరు చాలా ఖరీదైనది. 750ml లీటర్ల నీటికి 60,000 డాలర్లు (43 లక్షలు) ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బాటిల్ వాటర్. ఫ్రాన్స్‌లోని సహజ నీటి బుగ్గల నుండి ఈ నీరు వస్తుంది. 


ఈ వాటర్ బాటిల్‌ను 24 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. ఈ బాటిల్ ప్యాకింగ్ ధర అత్యధికం. ఈ నీరు విలక్షణమైన రుచిని కలిగివుంటుంది. ఈ నీరు బరువు శరీర తగ్గడానికి దోహదపడుతుంది. ఇది శారీరక శక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని మెరిపిస్తుంది. ఇక ఫిలికో జ్యువెల్ వాటర్ విషయానికొస్తే ఇది రూ. 15,965కి 750 ఎంఎల్ వాటర్‌ లభిస్తుంది. జపనీస్ వాటర్ బ్రాండ్ అయిన ఈ వాటర్ బాటిల్‌ను స్ఫటికాలతో అలంకరించారు, మార్కెట్లో ఈ సీసా పరిమిత ఎడిషన్ ఉంది. ఈ వాటర్ బాటిల్ చూస్తే ప్రముఖుల కోసం ప్రత్యేకంగా చేసినట్టు కనిపిస్తుంది. 

Updated Date - 2022-02-23T16:12:22+05:30 IST