సంక్రాంతి పండుగకు నోచుకోని పేదలు

ABN , First Publish Date - 2021-01-14T06:51:09+05:30 IST

వైసీప ప్రభుత్వ విధానాలతో ధరలు పెరిగి, నష్టపోయిన పంటలకు పరిహారం అందక పేద, మధ్య తరగతి వర్గాలు, రైతులు సంక్రాంతి పండుగకు దూరమయ్యారని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు.

సంక్రాంతి పండుగకు నోచుకోని పేదలు

మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు

మచిలీపట్నం టౌన్‌, జనవరి 13 : వైసీప ప్రభుత్వ విధానాలతో ధరలు పెరిగి, నష్టపోయిన పంటలకు పరిహారం అందక పేద, మధ్య తరగతి వర్గాలు, రైతులు సంక్రాంతి పండుగకు దూరమయ్యారని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు.  తన కార్యాలయంలో  బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ హయాంలో పేదలకు సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌ కానుకలు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం వీటిని రద్దు చేయడం వలన పేదలు ఈ ఏడాది సంక్రాంతి నాడు పస్తులు పడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. రేషన్‌ సరుకుల ధరలు కూడా పెంచడం దురదృష్టకరమన్నారు.  కరోనా కష్టకాలంలో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోలేని ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. టీడీపీ నాయకులు పి.వి. ఫణికుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T06:51:09+05:30 IST