Abn logo
Oct 28 2021 @ 07:44AM

మాజీమంత్రి Vijayabhasker క్వారీలో అధికారుల తనిఖీలు

పెరంబూర్‌(Chennai): పుదుకోట జిల్లాలో సుమారు వందకు పైగా రాళ్ల క్వారీలుండగా, వాటిలో అన్నాడీఎంకేకు చెందిన మాజీమంత్రి విజయ భాస్కర్‌ సహా ప్రముఖులకు చెందినవి అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో చాలా క్వారీలు మూతపడగా నడుస్తున్న 30 క్వారీల్లో మాజీ మంత్రి విజయ భాస్కర్‌కు సొంతమైన తిరువెంగైవాసల్‌లోని క్వారీ కూడా వుంది. ఈ క్వారీలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని భూగర్భ, గనుల శాఖ అధికారుల కు ఫిర్యాదులందాయి. దీంతో, దిండుగల్‌, కృష్ణగిరి జిల్లాలకు చెందిన తలా నలుగురు అధికారుల బృందాలు మాజీ మంత్రి విజయభాస్కర్‌ క్వారీ సహా అన్ని క్వారీల్లో తనిఖీలు చేశాయి. రెండు రోజులుగా జరుగుతున్న ఈ తనిఖీల్లో, క్వారీల్లో అనుమతులకు మించిరాళ్లు, కంకర తరలిస్తున్నారా? అని ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption