ఓటరు తుది జాబితాకు కసరత్తు

ABN , First Publish Date - 2021-12-05T05:50:28+05:30 IST

జిల్లాలో ఫొటో ఓటరు తుది జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు.

ఓటరు తుది జాబితాకు కసరత్తు

- జిల్లాలో కొనసాగుతున్న అభ్యంతరాల పరిశీలన

- వచ్చే నెల 5వ తేదీన విడుదల

జగిత్యాల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఫొటో ఓటరు తుది జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. ఫైనల్‌ ఎలకో్ట్రరల్‌ రోల్‌ - 2022లో ఎలాం టి తప్పులు లేకుండా పకడ్బందీగా రూపొందించేందుకు చర్యలు చేపడు తున్నారు. ఇప్పటివరకు కొనసాగిన అభ్యంతరాల స్వీకరణ గత నెలాఖరు తో ముగిసింది. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలి స్తున్నారు. పరిశీలన అనంతరం ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చే యనున్నారు. నాలుగు నెలలుగా జిల్లాలో ఓటు నమోదు, మార్పులు, చే ర్పులు, అభ్యంతరాల స్వీకరణ తదితర కార్యక్రమాలను అధికారులు చేప ట్టారు. ప్రస్తుతం ఓటరు జాబితా తయారీని ఒక కొలిక్కి తీసుకొని రావ డానికి ప్రయత్నిస్తున్నారు. తుది జాబితా రూపొందించి వచ్చే యేడాది జనవరి 5వ తేదిన విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. 


నాలుగు నెలలుగా కసరత్తులు...

రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ మేరకు నాలుగు నెలలుగా ఓటరు జాబితా తయారీకి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల విభాగం అధికారులు, రెవెన్యూ అధికారులు జాబితా తయారీకి కృషి చేస్తున్నారు. ఆగస్టు నుంచి అక్టోబరు 31వ తేది వరకు కొత్త ఓటు నమోదుతో పాటు పొలింగ్‌ కేంద్రాల మార్పులు, జాబితా నుంచి తొలగిం పులు, చిరునామా మార్పులు, చేర్పులకు దరఖాస్తులు స్వీకరించారు. బీ ఎల్‌ఓలు, ఎన్నికల విభాగం సిబ్బంది ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమా న్ని నిర్వహించారు. 2022 జనవరి 1వ తేది నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఓటరు జాబితా తయారీకి ప్రయత్నాలు జరుపుతున్నారు. 


జిల్లాలో వచ్చిన దరఖాస్తులు ...

జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఓటరు నమోదుకు అధికారులు దర ఖాస్తులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా గడువు ముగిసే నాటికి ఓట రు నమోదుకు 3,480 మంది దరఖాస్తులు చేసుకున్నారు. జగిత్యాల ని యోజకవర్గం పరిధిలో కొత్తగా నమోదుకు ఫారం-6 ప్రకారం 1,194, తొ లగింపు ఫారం-7 ప్రకారం 5,099, తప్పుల సవరణ ఫారం-8 ప్రకారం 154, కేంద్రాల మార్పు ఫారం 8ఏ ప్రకారం 17 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా కోరుట్ల నియోజకవర్గం పరిధిలో కొత్తగా నమోదుకు ఫా రం-6 ప్రకారం 989, తొలగింపు ఫారం-7 ప్రకారం 389, తప్పుల సవరణ ఫారం-8 ప్రకారం 188, కేంద్రాల మార్పు ఫారం 8ఏ ప్రకారం 20 దర ఖాస్తులు వచ్చాయి. ధర్మపురి నియోజకవర్గంలో కొత్తగా నమోదుకు ఫా రం-6 ప్రకారం 1,297, తొలగింపు ఫారం - 7 ప్రకారం 4,424, తప్పుల స వరణ ఫారం-8 ప్రకారం 116, కేంద్రాల మార్పు ఫారం 8ఏ ప్రకారం 4 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో, ప్రత్యేక శిబిరాల్లో క లిపి 16,591 మంది ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. తొల గింపునకు 12,612 మంది, తప్పుల సవరణకు 456 మంది, పోలింగ్‌ కేం ద్రాల మార్పుకు 41 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీ లనను అధికారులు జరుపుతున్నారు. ఈనెల 20వ తేదీ వరకు దరఖా స్తులపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిస్తారు. తుది జాబితాను వచ్చే యేడాది జనవరి 5వ తేదిన ప్రకటించనున్నారు.

ఓటు ప్రాముఖ్యతపై ప్రత్యేక క్యాంపులు...

జిల్లాలో ఉన్న విద్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని డిగ్రీ, వృత్తి నైపుణ్య కళాశాలల్లో ఎలక్టోరల్‌ లీటిరస్‌ క్లబ్బులు ప్రారంభించడానికి ప్ర యత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు తమ పోలింగ్‌ స్టేషన్‌ సులువుగా తె లుసుకునే విధంగా గరుడ యాప్‌ రూపొందించి ప్రజలలో విస్తృత ప్రచా రం చేయడానికి కృషి చేస్తున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటరు జాబి తాలో నమోదు చేసుకునే విధంగా అధికారులు కార్యక్రమాలను నిర్వహి స్తున్నారు. ఓటరు తుది జాబితాకు అవసరమైన కసరత్తులు జరుగుతుం డడంతో జిల్లాలో ఓటర్ల వివరాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశా లున్నాయి.


Updated Date - 2021-12-05T05:50:28+05:30 IST