Abn logo
May 17 2021 @ 01:02AM

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు

నిర్మల్‌లో రాత్రి కర్ఫ్యూ అమలు తీరును పరిశీలిస్తున్న సీఐ జీవన్‌ రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, మే 16: జిల్లాకేంద్రంలో లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమలు అవుతోంది. ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలో రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతోంది. లాక్‌ డౌన్‌ సందర్భంగా పట్టణ ప్రజలు సడలింపు ఇచ్చిన సమయంలో పనులు పూర్తి చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని దుకాణాలు తెరిచి ఉంటున్నాయి. కూర గాయల మార్కెట్‌లోనూ ఇదే సమయంలో అమ్మ కాలు జరుపుకుని ఇళ్లకు వెళ్తున్నారు. మందుల దుకాణాలు, హస్పిటల్స్‌, తదితర అత్యవసర సేవల కు మాత్రమే మినహయింపు ఉండటంతో ప్రజలు అనవసరంగా బయటకు రావడం లేదు. అనవసరం గా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేయడం, జరిమానాలు విధిస్తుండటంతో ప్రజలు బాధ్యతగా మెలుగుతున్నారు. అదేవిధంగా నిర్మల్‌లో సీఐ జీవన్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది రాత్రి పూట కర్ఫ్యూ అమలు పర్యవేక్షిస్తున్నారు. 

Advertisement