140 లీటర్ల సారా పట్టివేత

ABN , First Publish Date - 2020-02-20T10:57:36+05:30 IST

కురుపాం ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించి 140 లీటర్ల సారా పట్టుకున్నట్లు సీఐ జి.సతీష్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ

140 లీటర్ల సారా పట్టివేత

కురుపాం, ఫిబ్రవరి 19: కురుపాం ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించి 140 లీటర్ల సారా పట్టుకున్నట్లు సీఐ జి.సతీష్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెల్లవారుజామున కురుపాం సమీపంలోని సేకుపాడు జంక్షన్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సారా అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి తమను చూసి ద్విచక్ర వాహనం విడిచిపెట్టి పారిపోయాడని చెప్పారు. నాలుగు రబ్బర్‌ ట్యూబ్‌ల్లో ఉన్న 140 లీటర్ల సారాతో పాటు దాన్ని రవాణా చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వాహనం రిజిస్ట్రేషన్‌ వివారాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దాడిలో ఎస్‌ఐ దస్తగిరి, విజయనగరం ఎన్‌పోర్స్‌మెంట్‌ సిబ్బంది పాల్గొన్నారు.


పెదమేరంగి జంక్షన్‌లో 120 లీటర్లు...

పార్వతీపురంటౌన్‌, ఫిబ్రవరి 19: జియ్యమ్మవలస మండల పరిధి పెదమేరంగా జంక్షన్‌లో అక్రమంగా రవాణా చేస్తున్న 120 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు పార్వతీపురం ఎక్సైజ్‌ కార్యాలయం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కలీమ్‌ తెలిపారు. బుధవారం ఉదయం రూట్‌ మార్చ్‌ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి 120 లీటర్ల సారా రవాణా చేస్తుండడాన్ని గమనించామని చెప్పారు. బైక్‌ను వదిలి ఆ వ్యక్తి పారారయ్యాడన్నారు. అయితే వాహన యజమాని రేగిడి ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో సారా తయారీ, రవాణా, విక్రయాలపై నిఘా ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - 2020-02-20T10:57:36+05:30 IST