టెలీ మెడిసిన్‌ అమలు తీరు పరిశీలన

ABN , First Publish Date - 2022-05-26T05:12:46+05:30 IST

జిల్లాలో అమలు చేస్తున్న టెలీ మెడిసిన్‌ సేవలను పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి హెల్త్‌ యాక్సెస్‌ ఇంటర్నేష నల్‌ ఎన్‌జీవో బృందం సభ్యులు బుధవారం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని సం దర్శించారు.

టెలీ మెడిసిన్‌ అమలు తీరు పరిశీలన
డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో మాట్లాడుతున్న ఎన్‌జీవో బృందం

- డేటాఎంట్రీ ఆపరేటర్లతో మాట్లాడిన రాష్ట్రస్థాయి ఎన్‌జీవో బృందం

- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌కు నివేదిక ఇస్తామని వెల్లడి

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), మే 25 : జిల్లాలో అమలు చేస్తున్న టెలీ మెడిసిన్‌ సేవలను పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి హెల్త్‌ యాక్సెస్‌ ఇంటర్నేష నల్‌ ఎన్‌జీవో బృందం సభ్యులు బుధవారం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని సం దర్శించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో టెలీ మెడిసిన్‌ సేవలు ప్రజలకు ఏవిధంగా అందుతున్నాయి, ఏవైనా లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకోవడంతో పాటు దాన్ని మరింత విస్తృతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించేందుకు మొత్తం ఐదుగురితో కూడిన ఎన్జీవో బృందం సభ్యులు జనరల్‌ ఆసుపత్రిలోని టెలీమెడిసిన్‌ విభాగాన్ని పరిశీలిం చారు. ఈ సందర్భంగా స్పెషాలిటీ వైద్యులు, వైద్య సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో వారు మాట్లాడి వివరాలు సేకరించారు. అమలు తీరులో ఉన్న లోపాలు, ఇతర అంశాలను కమిషనర్‌ దృష్టికి తీసుకెళతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో బృందం సభ్యులు శ్రీమీన సత్యనారాయణ, చిల్షు చందన్‌, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఇన్‌చార్జి నాగరాజు శెట్టి, ప్రోగ్రాం ఆపరేటర్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T05:12:46+05:30 IST