సీఎం రాక ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2020-10-20T07:26:49+05:30 IST

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీ మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున

సీఎం రాక ఏర్పాట్ల పరిశీలన

 రేపు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్‌

వన్‌టౌన్‌, అక్టోబరు 19 : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీ మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని కలెక్టర్‌ ఇంతియాజ్‌, పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కలెక్టర్‌, సీపీతో పాటు ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, ఆలయ సిబ్బంది సోమవారం ఇంద్రకీలాద్రిపై ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు.


ఈవో ఎంవీ సురేష్‌బాబు, ఉత్సవాల ప్రత్యేక అధికారి చంద్రశేఖర్‌ అజాద్‌, వివిధ శాఖల అధికారులతో కొండపై ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ మూలానక్షత్రం రోజు.. అంటే ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం సీఎం కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు వస్తారన్నారు.

సీపీ మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. కొవిడ్‌ నిబంధనలను అనుసరించి సీఎం వెంట పరిమిత సంఖ్యలో అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏర్పాట్ల పరిశీలనలో అడిషనల్‌ సీపీ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-10-20T07:26:49+05:30 IST