Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిండు సభలో భువనేశ్వరిని అవమానించడం బాధాకరం.. YSRCP కి గుడ్ బై..

  • వైసీపీని వీడిన మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ 
  • మహిళలను గౌరవించలేని పార్టీలో కొనసాగలేనని స్పష్టీకరణ

చిత్తూరు జిల్లా/తంబళ్లపల్లె : తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు సతీమణి నారా భువ నేశ్వరిని నిండు సభలో వైసీపీ నేతలు అవమానించడం సిగ్గుచేటని మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ విమర్శించారు. మహిళలను గౌరవించలేని వైసీపీ తీరు నచ్చక ఆ పార్టీని వీడుతున్నట్లు శనివారం ఆమె మీడియాకు తెలిపారు.

గత ఎన్నికల్లో తాను, తన భర్త రెడ్డెప్ప వైసీపీ విజయానికి కృషి చేశామని అయితే, అధికార పార్టీలో ప్రజాస్వామ్యం అభాసుపాలవుతుండటం చూసి  జీర్ణించుకోలేక తాము వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక  ఏ రాజకీయ పార్టీలో కొనసాగేది లేదని.. వ్యవసాయం చేసుకుంటామని తెలిపారు. కాగా, నాగరత్నమ్మ 1998-99లో టీడీపీ తంబళ్లపల్లె ఎంపీపీగా పనిచేశారు. అనంతరం నాగరత్నమ్మ దంపతులు మూడేళ్ల కిందట ఎంపీ మిథున్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.

Advertisement
Advertisement