దొంగలను దొంగలంటే కోపమెందుకు ?

ABN , First Publish Date - 2022-06-30T05:30:00+05:30 IST

దొంగలను దొంగలంటే వైసీపీ నేతలకు ఎందుకు కోపమొస్తుందో తెలియటం లేదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు

దొంగలను దొంగలంటే కోపమెందుకు ?
సభలో మాట్లాడుతున్న యరపతినేని

ఇష్టారాజ్యంగా మాట్లాడితే మూల్యం తప్పదు

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

దాచేపల్లి, జూన్‌ 30 : దొంగలను దొంగలంటే వైసీపీ నేతలకు ఎందుకు కోపమొస్తుందో తెలియటం లేదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని, లేదని ఇష్టారాజ్యంగా మాట్లాడితే భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గురువారం ‘పల్లెపిలుస్తుంది’ కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి మండలం  పొందుగుల గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో యరపతినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబునాయుడును, ఆయన భార్య భువనేశ్వరి, లోకేశ్‌లపై వైసీపీనేతలు ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా మాట్లాడుతు న్నారని, ఇక ఎంతమ్రాతం మీ నోటిదురుసు మాటలను సహించేది లేదని హెచ్చరించారు. వైసీపీ నేతలు పత్రికల ముందు, బహిరంగ వేదికపై ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియనట్లుందని, నాలుకలు కోస్తాం, తలకాయలు తీస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్పటం చూస్తుంటే వారి భయం, ఆందోళన అర్ధమవుతూనే ఉందన్నారు. వారి ఉడత ఊపులకు భయపడే వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ప్రజలు నిశితంగా అన్ని గమనిస్తున్నారని, ఈ మూడేళ్లలో ఎవరు ఎంత అక్రమంగా, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారో తెలుస్తూనే ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ నేతలను ఇళ్ల దగ్గర కూర్చేపెట్టే పనికి అన్ని వర్గాల ప్రజలు సన్నమద్దమవుతున్నారని తెలిపారు.  రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో విసిగివేసారి పోయారని, ఒక్కసారి అవకాశమిస్తే ఇంత చేశాడు.. మరోమారు అధికారం చేపడితే ఎలా ఉంటుందోనని భయంతో వణుకుతున్నారని అన్నారు. సత్తెనపల్లిలో వైసీపీ ప్లీనరీకి జనం రారని గ్రహించి పిడుగురాళ్లలో ప్లీనరీ పెట్టుకున్నా రని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు ఇప్పటికైనా పద్దతిగా మాట్లాడటం నేర్చుకోవాలని, సంస్కారవంతంగా ఉండాలని సూచ

Updated Date - 2022-06-30T05:30:00+05:30 IST