మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలి

ABN , First Publish Date - 2020-11-25T06:33:02+05:30 IST

పిఠాపురం రూరల్‌, నవంబరు 24: గొర్రిఖండిపై జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను రైతులే అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ కోరారు. భోగాపురం ఆయకట్టు పరిధిలో గొర్రిఖండిపై జరుగుతున్న తవ్వకాలను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ

మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలి
భోగాపురం ఆయకట్టు వద్ద తవ్వకాలను పరిశీలిస్తున్న వర్మ

మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం రూరల్‌, నవంబరు 24: గొర్రిఖండిపై జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను రైతులే అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ కోరారు. భోగాపురం ఆయకట్టు పరిధిలో గొర్రిఖండిపై జరుగుతున్న తవ్వకాలను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గొర్రిఖండి గట్లను మట్టి మాఫీమా మింగేస్తోందని, దీనికి ఇరిగేషన్‌ అధికారులు కొమ్ముకాస్తున్నారన్నారు. టోల్‌ పక్క కాలువకు గండి పడి సుమారు 100 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయన్నారు. ఆధునికీకరణ పేరుతో మల్లవరంలో కూడా గట్లు తవ్వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఏలేరు ఆఽధునికీకరణ పనులు చేపడితే ఆ మట్టిని తవ్వి ఇప్పుడు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. దీని వల్ల భోగాపురం, రాపర్తి, జములపల్లి గ్రామాలు ముంపునకు గురవుతాయని వర్మ తెలిపారు. కార్యక్రమంలో అల్లుమల్లు విజయకుమార్‌, కరెడ్ల వీర్రాజు, గుండ్ర కృష్ణ, ఊటా కని్‌షబాబు పాల్గొన్నారు. 

గండ్లు పూడ్చాలి

పిఠాపురం, నవంబరు 24: వరదల వల్ల నియోజకవర్గ పరిధిలోని కాలువలకు పడిన గండ్లను పూడ్చి తక్షణం రెండోపంటకు నీరివ్వాలని మాజీ ఎమ్మె ల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. సూరంపాలెంలో కాలువకు గండ్లు పడిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రైతులకు రెండో పంట పండించుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నాయకులు ఉ లవకాయల దేవేంద్రుడు, గుండ్ర సుబ్బారావు, శీరం మాణిక్యం, మాదేపల్లి వినీల్‌వర్మ, బస్వా సత్యనారాయణ, గండే నాగేశ్వరరావు, తాతాజీ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-25T06:33:02+05:30 IST