సమావేశంలో ప్రసంగిస్తున్న శ్రావణ్ కుమార్
గుంటూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొడాలి నాని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, గుడివాడలో జరిగిన సంఘటనకు ఆయనకు కాకుండా ఎవరికి సంబంధం ఉంటుందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కుటుంబంపై దాడి చేయడానికి మంత్రి నానిని వైసీపీ పెంపుడు కుక్కలా వాడుకుంటుందన్నారు. నిజంగా జూదగృహాలతో ఆయనకు సంబంధం లేనపుడు నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారన్నారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి బూతులు తిట్టడమే ధ్యేయంగా నాని పెట్టుకున్నారన్నారు. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు దాసరి రాజామాష్టారు, కంచర్ల శివరామయ్య, నాయుడు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.