Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ప్రజా సమస్యల చర్చావేదికే గౌరవ సభ’

గోపాలపురం, డిసెంబరు 4 : ప్రజా సమస్యల చర్చా వేదికే గౌరవ సభ అని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వ రరావు అన్నారు. చెరుకుమిల్లి, వెంకటాయపాలెం గ్రామాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపు మేరకు గౌరవసభ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు రొంగలి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముప్పిడి మాట్లాడుతూ ఓటీఎస్‌ పేరుతో ప్రజల వద్ద నుంచి సొమ్మును లాక్కునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. రాజమండ్రి పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు కొర్లపాటి రాము, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఉండవల్లి రత్న కుమారి, గంగాభవాని, యండ్రప్రగడ మంగారావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు ప్రసాద్‌బాబు, ఎస్సీసెల్‌ మండల అధ్యక్షుడు రవి, ఎస్సీ సెల్‌ మాజీ అధ్యక్షుడు ముప్పిడి అనిల్‌కుమార్‌, జామి సూర్యచంద్రం, ముప్పిడి అశోక్‌, జ్యేష్ట శ్రీనివాస్‌, చదలవాడ ప్రసాద్‌ ఉన్నారు.

Advertisement
Advertisement