హోం మంత్రిని వెంటనే తొలగించాలి

ABN , First Publish Date - 2022-05-01T16:20:41+05:30 IST

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షల అక్రమాల నేపథ్యంలో హోంశాఖ మంత్రిని వెంటనే తొలగించాలని ప్రతిపక్షనేత సిద్దరామయ్య డిమాండ్‌ చేశారు. బెంగళూరులో శనివారం ఆయన

హోం మంత్రిని వెంటనే తొలగించాలి

                        - ప్రతిపక్ష నేత సిద్దరామయ్య డిమాండ్‌ 


బెంగళూరు: సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షల అక్రమాల నేపథ్యంలో హోంశాఖ మంత్రిని వెంటనే తొలగించాలని ప్రతిపక్షనేత సిద్దరామయ్య డిమాండ్‌ చేశారు. బెంగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్రకు నైతికత ఉంటే పదవిలో కొనసాగకూడదన్నారు. అక్రమాలపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే మంత్రి తప్పుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అవినీతిపరులు, దోపిడీ దారులు, రేపిస్టులను అక్రమార్కులను సమర్థించడమే తన కర్తవ్యం అనేలా హోం మంత్రి వ్యవహరిస్తున్నారని, ఇంతటి విఫలం చెందిన హోం మంత్రిని చూడలేదని పేర్కొన్నారు. మరోసారి పరీక్షలు జరిగితే ఆరగ జ్ఞానేంద్రలాంటి అసమర్థులే ఎంపికవుతారన్నారు. అక్రమాలు జరిగినట్టు సీఐడీ తేల్చినట్లయితే నివేదిక విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మరోసారి పరీక్షలు జరపడం నిజాయితీ అభ్యర్థులకు న్యాయం చేసేందుకా లేదా అక్రమాల కేసును మూసివేసేందుకా..? అని ప్రశ్నించారు. సూత్రధారి దివ్యా హాగరగి అరెస్టు అయిన వెంటనే మరోసారి పరీక్షలు ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నారు. 

Updated Date - 2022-05-01T16:20:41+05:30 IST