రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసు

ABN , First Publish Date - 2021-05-08T06:11:26+05:30 IST

రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసు

రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసు

ఫఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, వైవీబీ

విజయవాడ రూరల్‌, మే 7 : రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్‌440కే వైరస్‌ తీవ్రతను తెలియజేసినందుకు క్రిమినల్‌ కేసు పెట్టడాన్ని ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు, పార్టీ గన్నవరం ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యేనన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతలపై మాత్రం అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్‌ కేసు నమో దు చేయడాన్ని ఖండిస్తూ బచ్చుల అర్జునుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలను పక్కనపెట్టి, ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఒకవైపున కరోనా రెండో దశకు జనం పిట్టల్లా రాలుతున్నా, శవాలను దహనం చేసేందుకు శ్మశానాల వద్ద క్యూ కడుతున్న దుర్భర పరిస్థితి ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట కాదా అని అర్జునుడు ప్రశ్నించారు. 

ఫ ఉయ్యూరు : ప్రభుత్వ వైఫల్యాలను క ప్పి పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు నమోదు  చేశారని ఎమ్మెల్సీ వైవీబీ రాజేద్రప్రసాద్‌ శుక్రవారం ఓప్రకటనలో  ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవంతో  ప్రజలు  పిట్టల్లా రాలిపోతున్నా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పట్టించుకోవడం లేదని రాజమండ్రిలో  వైసీపీ ఎంపీలే బహిర్గతం చేశారని విమర్శించారు.  ఇప్పటికైనా సీఎం జగన్‌ కక్షసాధింపు ధోరణి మార్చుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-05-08T06:11:26+05:30 IST