ప్రతీ ఒక్కరు జాతీయ భావం కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2022-08-15T05:31:19+05:30 IST

ప్రతీ ఒక్కరిలోనూ జాతీయ భావం కల్గి ఉండాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతకుమార్‌ అన్నారు.

ప్రతీ ఒక్కరు జాతీయ భావం కలిగి ఉండాలి
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర కోషాధికారి బండారి శాంతకుమార్‌

మహబూబ్‌ నగర్‌ (క్లాక్‌టవర్‌), ఆగస్టు 14 : ప్రతీ ఒక్కరిలోనూ జాతీయ భావం కల్గి ఉండాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతకుమార్‌ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తం గా నిర్వహించుకుంటున్న ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రధాన మంత్రి పిలుపు మేరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగర వేయాలని కోరారు. ఈ షయంపై ఆయన ఆదివారం బీజేపీ జిల్లా కార్యాలయం లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ జెండాను ఒక వైపు మాత్రమే ము ద్రించి రెండో వైపు తెలుపు రంగుతో ఉంచడం జాతిని, జాతీయ జెండాలను అ గౌరవ పరచడమేనని ఆయన విమర్శించారు. ఎక్కడైనా జాతీయ జెండాను ఆవి ష్కరించే ముందు శాంతికి ప్రతి రూపమైన పావురాన్ని ఎగురవేస్తారని, కానీ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గన్నుతో కాల్పులు జరపడమేమిటని ఆయన ప్రశ్నిం చారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, సత్యం, అంజయ్య, పి. రాజేందర్‌రెడ్డి, వెంకట్‌ సాగర్‌ పాల్గొన్నారు. 

బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

మహబూబ్‌ నగర్‌ (క్లాక్‌టవర్‌) : స్వతంత్రం భారత వజ్రోత్సవ్‌లో భాగంగా బీజేవైఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలమూరులో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం అప్పన్నపల్లి నుంచి పట్టణంలో బీజేవైఎం జిల్లా కమిటీ అధ్యక్షుడు కిరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు గడియారం చౌరస్తాలో స్వాతంత్య్ర సమరయోధులకు వారుఘనంగా నివాళులు అర్పించా రు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్‌, జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తిరుపతిరెడ్డి, నాయకులు ఆంజనేయులు, అర్వింద్‌రెడ్డి, గడ్డం నాగరాజు, శ్రీనాథ్‌, నవీన్‌రెడ్డి, కృష్ణం రాజు, రాచాల శ్రీధర్‌, శివారెడ్డి, రాము, నరేష్‌, వెంకటేశ్‌, చెన్నయ్య, వేణు, అభిలాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T05:31:19+05:30 IST