ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-14T05:14:04+05:30 IST

ప్రతిఒక్కరూ జాతీయ నా యకులను ఆదర్శంగా తీసుకుని దేశభక్తిని పెంపొం దించుకోవాలని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి
చీరాలలో జాతీయజెండాలతో ఐటీసీ కార్మికుల బైక్‌ ర్యాలీ

 పలుచోట్ల జాతీయ జెండాలతో ర్యాలీలు

అద్దంకిటౌన్‌, ఆగస్టు 13: ప్రతిఒక్కరూ జాతీయ నా యకులను ఆదర్శంగా తీసుకుని  దేశభక్తిని పెంపొం దించుకోవాలని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ వి ద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించి ఆజాదీకా అమృ త్‌ మహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి భారీ  ర్యాలీ నిర్వహించారు. ముందుగా కృష్ణచైతన్య ఆంధ్రకే సరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం శ్రీప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నుంచి బంగ్లా రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు 150 అడుగల జాతీయ జెండాను ప్రదర్శి స్తూ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన   జాతీయ నాయకుల వేషధారణలు  ఆక ట్టుకున్నాయి. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌ప ర్సన్‌ ఏస్తేరమ్మ, వైసీపీ నాయకులు జ్యోతి హనుమం తరావు, అవిశన ప్రభాకర్‌రెడ్డి తదితరులతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


మార్టూరులో ..

మార్టూరు, ఆగస్టు 13:  ఆజాదీ కా అమృత్‌ మహాత్సవ  కార్యక్ర మంలో భాగంగా శని వారం మార్టూరులో శ్రీహర్షిణి విద్యా సంస్థ ల విద్యార్థులు 150 అడుగుల పొడవు కలి గిన జాతీయ పతాకం తో  ప్రదర్శన నిర్వ హించారు. కార్యక్ర మంలో ప్రిన్సిపాల్‌ గ డ్డం ఆంజనేయులు, ఉపాధ్యాయులు పాల్గొ న్నారు. అలాగే, గ్రామ పంచాయతీ వారు తూర్పు బజారున పంచాయతీ ఈవో తన్నీ రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో జాతీయ పతాకం ప్రదర్శన చే శారు. మండల కాంప్లెక్స్‌ వద్ద తహసీల్దారు శివ వెంకట రెడ్డి ప్రదర్శన వెంట జాతీయ పతాకంతో నడిచారు. 


జాతీయ భావంతో మెలగాలి

పర్చూరు, ఆగస్టు 13: ప్రతిఒక్కరూ జాతీయ భా వంతో మెలగాలని శారదాహైస్కూల్‌ సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ క్రిష్ణంశెట్టి రామకోటేశ్వరరావు అన్నారు. 75వ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా శనివారం జాతీయ జెండాలతో విద్యార్థులు ర్యాలీ నిర్వ హించారు. గ్రామ పురవీదుల్లో దేశభక్తిని చాటేవిధంగా భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామకోటేశ్వరరావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ వేడుకలు జరుపుకోవటం హర్షించతగ్గ విషయమన్నారు. కార్యక్ర మంలో ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు, సిబ్బంది, విద్యార్థు లు పాల్గొన్నారు. 

అద్దంకి టౌన్‌: ప్రతి ఒక్కరూ అజాదీకా అమృత్‌ మహో త్సవ్‌(నిరంతరం స్వేచ్ఛ స్వాతంత్యాలతో వర్ధి లాలి) ఉద్దేశాన్ని, జాతీ య జెండా ప్రాధాన్యతను తె లుసుకోవాలని హెచ్‌ఎంలు జీవీ సుబ్బయ్య, రాఘవ య్య అన్నారు. అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడు కలను పలు పాఠశాలల ఆధ్వర్యంలో శనివారం ఘ నంగా నిర్వహించారు. ప ట్టణంలోని శ్రీ ప్రభుత్వ బా లికల ఉన్నత పాఠశాల, శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల వి ద్యార్థులలో జాతీయ జెండాలతో ప్రధాన వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల విద్యార్థులతో పాటు పాఠశాల విద్యా కమి టీ చైర్మన్‌లు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. 


ఉత్సాహంగా, ఉల్లాసంగా..

చీరాల, ఆగస్టు 13 : పట్టణ, గ్రామీణ ప్రాంతమనే తేడాలేకుండా ఆజాదీకా అమృత్‌ ఉత్సవ్‌ వేడుకల్లో భాగంగా శనివారం పలు సంస్థలు, పాఠశాలలు, ప్ర భుత్వ విభాగాల ప్రతినిధులు నిర్వహించిన కార్యక్ర మాలలో జాతీయజెండా రెపరెపలతో ఆనందోత్సాహా లు వెల్లివిరిశాయి. ఐఎల్‌టీడీ కంపెనీ ఉద్యోగులు, కా ర్మికులు పట్టణంలో జాతీయజెండాలతో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కంపెనీ మేనేజర్‌ శ్యాంసుందర్‌ ప్రారంభించారు. రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. భారీ జాతీయజెండాతో విద్యార్థులు ర్యాలీగా వస్తుం డగా రోటరీ ప్రతినిధులు ర్యాలీ అగ్ర భాగాన జాతీయ జెండాల పట్టుకుని వారిని ఉత్సాహపరిచారు. పలు గ్రామాల్లో విద్యార్థులు జాతీయజెండాలతో ర్యాలీ నిర్వ హించారు. స్థానిక ఓఏటీలో మున్సిపాలిటీ  ఆధ్వర్యం లో ఉత్సవాలలో భాగంగా పలు రకాల క్రీడాపోటీలు నిర్వహించారు. పోటీలను మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సి పల్‌ కమిషనర్‌  సీహెచ్‌ మల్లీశ్వరరావు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

చీరాలటౌన్‌:  చీరాలలోని సెయింట్‌ మార్క్స్‌ లూథ రన్‌ కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్‌ గారపాటి పు ష్పరాజ్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వి ద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, స్వాతం త్య్ర గీతాలాపన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ శీలం విద్యాసాగర్‌, మంజుల, సుమ, చినపాప, పార్వతి, షీలాఖాద్రి, షిపో రా, సునీత, లక్ష్మయ్య, వినీల తదితరులు పాల్గొన్నారు. పేరాల చిన్నరథం సెంటర్‌లో నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ విగ్రహం వద్ద పలువురు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ సేవకుడు ఊరా మస్తాన్‌రావు, ఉపాధ్యాయులు పవని భానుచంద్రమూర్తి, చుండూరి కృష్ణమూర్తి, అన్నంరాజు సుబ్బారావు, సురేష్‌, రామ్మూ ర్తి నాయుడు, శివరాజకుమారి, మణిబాబు తదిత రులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-14T05:14:04+05:30 IST