ఉపాధి హామీలో అందరికీ ఒకే వేతనం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-06-22T04:47:53+05:30 IST

ఉపాధిహామి పథకంలో అందరికీ ఒకే వేతనం ఇవ్వాలని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘాలు, ఉపాధి కూలీలు సోమవారం ధర్నా నిర్వహించారు.

ఉపాధి హామీలో అందరికీ ఒకే వేతనం ఇవ్వాలి
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయులు

రైల్వేకోడూరు, జూన్‌ 21: ఉపాధిహామి పథకంలో అందరికీ ఒకే వేతనం ఇవ్వాలని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘాలు, ఉపాధి కూలీలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నేతలు గంపల దేశయ్య, మారయ్య, జైక్రిష్ణ, మురగయ్య, శంకరయ్యలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కులం ఆధారంగా దళితులకు, ఇతరులకు వేర్వేరుగా వేతనాలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణం ఈ విధానాన్ని ఉపసంహరించుకుని అందరికీ సమానం వేతనాలు ఇవ్వాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ చంద్రశేఖర్‌, మహిళా సంఘం నాయకురాళ్లు   నారాయణమ్మ, ఎన్‌.మనెమ్మ, జి. సరస్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:47:53+05:30 IST