18 ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్‌ తీసుకునేలా చూడాలి

ABN , First Publish Date - 2021-09-17T06:52:51+05:30 IST

ప్రత్యేక డ్రైవ్‌లో 18 ఏళ్లు నిండిన వారందరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకునే విధంగా చూడాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి వైద్య ఆరోగ్య, మున్సిపల్‌, గ్రా మీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు.

18 ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్‌ తీసుకునేలా చూడాలి
స్వచ్ఛతహి సేవా పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, తదితరులు

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 16: ప్రత్యేక డ్రైవ్‌లో 18 ఏళ్లు నిండిన వారందరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకునే విధంగా చూడాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి వైద్య ఆరోగ్య, మున్సిపల్‌, గ్రా మీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై సమీక్షించారు. ప్రత్యేక డ్రైవ్‌ ను గతంలో లాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే కాకుండా సబ్‌ సెంటర్‌లలో, మున్సిపాలిటీలలోని ప్రతీవార్డులలో నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకునేలా చూడాలన్నారు. ప్రతీరోజు ప్రతీ సెంటర్‌లో కనీసం వందమందికి వ్యాక్సిన్‌ వేయాలని, అందుకు అనుగుణంగా ఏర్పా ట్లు చేయాలన్నారు. గ్రామస్థాయి సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేయించాలని, ప్రత్యేక స్టిక్కర్‌లు వే యాలన్నారు. ఈ సెల్‌కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

స్వచ్ఛతహి సేవా పక్షోత్సవాల పోస్టర్‌ల ఆవిష్కరణ

ఈనెల 15 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించే స్వచ్ఛతహి సేవా పోస్టర్‌లను కలెక్టర్‌ నారాయణరెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ కా ర్యక్రమంలో భాగంగా శ్రమదానాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ, ఇంటింటి చెత్త సేకరణ, స్వచ్ఛత కర్మి ప్రేరక్‌ల అవార్డుల ప్రదానం తదితర కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2021-09-17T06:52:51+05:30 IST