ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి

ABN , First Publish Date - 2021-07-31T06:17:05+05:30 IST

గ్రామాలకు మండ లానికి అనుసంధాన కర్తలుగా ఎంపీటీసీలు, మండలానికి జిల్లాకు అనుసంధాన కర్తలుగా జడ్పీటీసీలు విధులను సక్రమంగా నిర్వహించాలని, ప్రతి పైసా ప్రజల కోణంలో ఆలోచించి ఖర్చు చేయాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు.

ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి
మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌, హాజరైన ప్రజాప్రతినిధులు

- పురపాలక ఐటీ శాఖ మంత్రి   కే తారకరామారావు 

- ముస్తాబాద్‌ మండల అభివృద్ధిపై సమీక్ష 

సిరిసిల్ల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): గ్రామాలకు మండ లానికి అనుసంధాన కర్తలుగా ఎంపీటీసీలు, మండలానికి జిల్లాకు అనుసంధాన కర్తలుగా జడ్పీటీసీలు విధులను సక్రమంగా నిర్వహించాలని, ప్రతి పైసా ప్రజల కోణంలో ఆలోచించి ఖర్చు చేయాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లో ముస్తాబాద్‌ మండల అభివృద్ధిపై  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, సర్పంచులు, ఎంపీటీసీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల న్నారు. పూర్తయిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్రత్యేక చొరవతో గ్రామాల్లో మౌలిక సమస్యలు పరిష్కారమయ్యాయఅన్నారు. మండలంలో అనువైన స్థలం గుర్తించి ఒక పరిశ్రమ స్థాపించేలా చూస్తామని, దాని ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. చెరువులు నిండి కాలువలు పారుతాయని ప్రజలు ఊహించలేదని, ముఖ్యమంత్రి దానిని నిజం చేసి చూపించారని అన్నారు. సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలిగామని, అన్ని గ్రామాలకు నీల్లు వస్తాయని అన్నారు. నర్మాల ఎగువ మానేరు అడుగు ప్రాంతం మనం భవిష్యత్‌లో చూడలేమని, కాలువల వెంట అన్ని గ్రామాలకు నీరందిస్తామని తెలిపారు. ముస్తాబాద్‌ నుంచి దుబ్బాక వెళ్లే రోడ్డు డబుల్‌ రోడ్డుగా నిర్మిస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న ముస్తాబాద్‌  రాళ్లపేట రోడ్డును పూర్తి చేయాలని ఆదేశించారు. మండలంలో అవసరమైన వంతెనలు నిర్మిస్తామని గ్రామాల్లో ప్రగతిలో ఉన్న పనులను పూర్తి చేయడానికి స్థానిక సర్పంచ్‌ ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ముస్తాబాద్‌ మండలంలోని  గ్రామాల్లో నాటిన మొక్కలు బాగున్నాయని మంత్రి ప్రశంసించారు. సేంద్రియ ఎరువులను తయారు చేయడా నికి కంపోస్ట్‌ షెడ్లు, పల్లె  ప్రకృతివనాలు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు నిర్మించడం గొప్ప విషయ మన్నారు.  ఏ రాష్ట్రాల్లోని గ్రామాల్లోనూ  ఇలాంటి అభి వృద్ధి జరగలేదన్నారు. 70 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి 7 సంవత్సరాల్లో పూర్తయిందన్నారు. జిల్లా స్థానికసంస్థల విభాగాలను మంత్రి అభినందించారు. జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవో రవీందర్‌, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, ముస్తాబాద్‌ ఎంపీపీ శరత్‌రావు, జడ్పీటీసీ నర్సయ్య, ఎంపీడీవో రమాదేవి, రైతు బంధు కో ఆర్డినేటర్‌ గోపాల్‌రావు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T06:17:05+05:30 IST