మిక్కీమౌస్‌ వేషధారణతో ఈవ్‌టీజింగ్‌

ABN , First Publish Date - 2022-07-07T06:11:56+05:30 IST

మిక్కీమౌస్‌ వేషధారణలో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఆకతాయిపై కేసు నమోదు చేశామని పలమనేరు సీఐ భాస్కర్‌ తెలిపారు.

మిక్కీమౌస్‌ వేషధారణతో ఈవ్‌టీజింగ్‌
మిక్కీమౌస్‌ వేషధారణతో అమ్మాయిలను టీజింగ్‌ చేస్తున్న కరీముల్లా

యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు


గంగవరం, జూలై 6: మిక్కీమౌస్‌ వేషధారణలో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఆకతాయిపై కేసు నమోదు చేశామని పలమనేరు సీఐ భాస్కర్‌ తెలిపారు. పలమనేరు ప్రభుత్వ కళాశాల వద్ద  ప్రాంక్‌ వీడియోస్‌ పేరిట ఓ యువకుడు మిక్కీమౌస్‌, టెడ్డీబేర్‌ వేషధారణలో కళాశాలకు వచ్చే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ సిబ్బందితో కలసి కళాశాల గేటువద్ద నిఘా ఉంచారు. ఈక్రమంలో కళాశాల బెల్‌ కొట్టగానే బయటకు వస్తున్న విద్యార్థినులను అడ్డగిస్తూ వారిని తాకుతూ, వారి అనుమతి లేకుండానే సెల్ఫీలు దిగాలని టీజింగ్‌ చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్న పలమనేరు వేణుగోపాలస్వామి వీధికి చెందిన సయ్యద్‌ కరీముల్లా(21)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడినా వెంటనే నెం.9440796733 కు కాల్‌ చేయాలని సీఐ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆకతాయిల ఆటకట్టించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. 

Updated Date - 2022-07-07T06:11:56+05:30 IST