హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణాస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి, సహా పలువురు నేతలు పాల్గొన్నారు.