గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం, విద్య అందించేందుకే జీఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-02-13T05:18:28+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం, విద్య అందించేందుకే స్వచ్చందంగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. తన తండ్రి గడల

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం, విద్య అందించేందుకే జీఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు
సభలో మాట్లాడుతున్న గడల శ్రీనివాసరావు

రాష్ట్ర ప్రభుత్వ హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాస్‌రావు

కొత్తగూడెంలో తన తండ్రి జ్ఞాపకార్థం ట్రస్ట్‌ ఏర్పాటు

ప్రారంభించిన ప్రభుత్వ విప్‌ రేగా, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం, ఫిబ్రవరి 12: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం, విద్య అందించేందుకే స్వచ్చందంగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. తన తండ్రి గడల సూర్యనారాయణ జ్ఞాపకార్థం భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని రైటర్‌బస్తీలోని 8వ లైనలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ జీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో విద్య, వైద్యం అందక ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ ట్రస్టు ద్వారా వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. కొత్తగూడెంవాసినైన తనకు ట్రస్టు ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. హైదరాబాద్‌ ప్రాంతం నుంచి నిపుణులైన వైద్యులను తీసుకొచ్చి ఈ ట్రస్టు ద్వారా వైద్యాన్ని అందిస్తానని భరోసా ఇచ్చారు. నిరుపేదలకు అండగా నిలిచి వారి సమస్యలకు ట్రస్టు ద్వారా తోచిన సహాయ, సహాకారాలు అందిస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, రాష్ట్ర విప్‌ రేగా కాంతారావు రిబ్బనకట్‌ చేసి డాక్టర్‌ జీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ను ప్రారంభించారు. అనంతరం డైరెక్టర్‌ తండ్రి గడల సూర్యనారాయణ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన నీట్‌ విద్యార్థిని స్పందన 7వేల ర్యాంకు సాధించగా ఆ విద్యార్థినిని గడల శ్రీనివాసరావు అభినందించారు. ఆ విద్యార్థి చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తమ ట్రస్టు ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన గడల శ్రీనివాసరావును బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్‌ సన్మానించి శుభాకాంక్షులు తెలిపారు. కార్యక్రమంలో  జడ్పీచైర్మన కోరం కనకయ్య, జడ్పీవైస్‌చైర్మన కంచర్ల చంద్రశేఖరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్‌కే. సాబీర్‌పాషా, మున్సిపల్‌చైర్‌పర్సన కాపు సీతాలక్ష్మి, వైస్‌చైర్మన దామోదర్‌ యాదవ్‌, ఇనకం టాక్స్‌ ఆఫీసర్‌ జీవనలాల్‌, డీసీసీబీ డైరెక్టర్‌ తుళ్లూరు బ్రహ్మయ్య, డీఎంఅండ్‌హెచవో శిరీష, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రవిబాబు, కొత్తగూడెం బార్‌ అసోసియేషన అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, భద్రాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని), బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్‌, ఉర్థుఘర్‌ కమిటీ చైర్మన అన్వర్‌పాషా, మున్సిపల్‌ కౌన్సిలర్లు పల్లపు లక్ష్మణ్‌ కోలాపూరి ధర్మరాజు, రుక్మాగందర్‌ బండారి, పరమేష్‌ యాదవ్‌, వేముల ప్రసాద్‌, మోర రూప, అంబుల వేణు, కో ఆప్షన సభ్యులు దూడల బుచ్చయ్య, సత్యం స్వచ్చంద సంస్థ అధ్యక్షులు పొన్నెకంటి సంజీవరావు, స్వేరేష్‌ జిల్లా బాధ్యులు జన్ను రవి, మోదుగు జోగారావు,  టీఆర్‌ఎస్‌ నాయకులు వనమా రామకృష్ణ, ఎంఎ. రజాక్‌, బీమా శ్రీధర్‌, రావి రాంబాబు, యూసఫ్‌, మాదా శ్రీరాములు, కొండస్వామి, మోరె భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 


Updated Date - 2022-02-13T05:18:28+05:30 IST