క్రీడల ప్రోత్సాహానికే మైదానాల ఏర్పాటు

ABN , First Publish Date - 2022-08-17T05:32:45+05:30 IST

రాష్ట్రంలో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిం చేందుకే ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ క్రీడా మైదానాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు.

క్రీడల ప్రోత్సాహానికే మైదానాల ఏర్పాటు
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న అతిథులు

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ 

జగిత్యాల అర్బన్‌, ఆగస్టు 16: రాష్ట్రంలో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిం చేందుకే  ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ క్రీడా మైదానాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక మి నీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న ఫ్రీడం కప్‌ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ, యువతలో దేశ భక్తి, స్నేహభావం పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఫ్రీడమ్‌ కప్‌ పోటీలను ప్రభు త్వం నిర్వహిస్తుందన్నారు. ఊడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రయత్నిస్తూ, విజయలక్ష్యాలను చేరుకోవాలన్నా రు. గ్రంథాలయ చైర్మెన్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌ మాట్లాడుతూ క్రీడా నైపుణ్యం పెం పొందించుకొని, మెళకువలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర క్రీడా కారులు ప్రతిభ కనబర్చాలన్నారు. బల్దియా చైర్‌పర్సన్‌ శ్రావణి మాట్లాడుతూ శారీరక మాన సికోల్లాసానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ, స్పోర్ట్స్‌ అధికారి డాక్టర్‌ భోనగిరి నరేష్‌, వైస్‌ చైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌, బల్దియా కమి షనర్‌ స్వరూపారాణి తదితరులున్నారు. అంతకు ముందు పట్టణంలోని ధరూర్‌ క్యాంప్‌లోగల గురుకుల పాఠశాలను సందర్శించి వసతులు, విద్యాభోధన తదితర విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ఫజగిత్యాల పట్టణంలోని 43వ వార్డుకు చెందిన యండి అబ్దుల్‌ హమీద్‌ కూతు రికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3లక్షల విలువ గల చెక్కును లబ్దిదా రునికి ఇంటికి వెళ్లి అందజేశారు. ఆయన వెంట కౌన్సిలర్‌ ఫిర్దోస్‌ తరుణ్ణం నదే, మై నార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌ ఖాదర్‌, ముజాహిద్‌, ముస్లిం సెంట్రల్‌ కమిటీ అధ్య క్షుడు అబ్దుల్‌ బారి తదితరులున్నారు. 

Updated Date - 2022-08-17T05:32:45+05:30 IST