లైఫ్‌ సర్టిఫికెట్‌కు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-11-29T07:33:48+05:30 IST

పెన్షన్‌ తీసుకుంటున్న విశ్రాంత ప్రభుత్వోద్యోగులు జీవన ప్రమాణ పత్రం(లైఫ్‌ సర్టిఫికెట్‌) సమర్పించే గడువును పొడిగిస్తూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎ్‌ఫవో) ఉత్తర్వులు జారీ చేసింది...

లైఫ్‌ సర్టిఫికెట్‌కు గడువు పొడిగింపు

  • ఫిబ్రవరి చివరికల్లా దాఖలుకు అవకాశం


న్యూఢిల్లీ, నవంబరు 28: పెన్షన్‌ తీసుకుంటున్న విశ్రాంత ప్రభుత్వోద్యోగులు జీవన ప్రమాణ పత్రం(లైఫ్‌ సర్టిఫికెట్‌) సమర్పించే గడువును పొడిగిస్తూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎ్‌ఫవో) ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లు ఏటా నవంబరులోగా లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. నేరుగా ఈపీఎ్‌ఫవో కార్యాలయాలు, సంయుక్త సేవా కేంద్రాలు(సీఎ్‌ససీలు), పెన్షన్‌ డిస్బర్సింగ్‌ బ్యాంకులు (బ్రాంచి), పోస్టల్‌ నెట్‌వర్క్‌, జేపీపీ పోర్టల్‌ ద్వారా వీటిని సమర్పించవచ్చు. అయితే.. కొవిడ్‌-19 నేపథ్యంలో వృద్ధులు బయటకు రావొద్దని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో.. లైఫ్‌ సర్టిఫికెట్‌ దరఖాస్తు గడువును వచ్చే ఏడాది ఫిబ్రవరి 28లోగా ఆయా బ్రాంచిల్లో లేదా ఆన్‌లైన్‌లో లైఫ్‌ సర్టిఫికెట్‌ను అందజేయవచ్చని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-11-29T07:33:48+05:30 IST