తినేదేంటని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది: నరేంద్ర చావ్లా

ABN , First Publish Date - 2021-01-21T22:57:08+05:30 IST

రెస్టారెంట్లు, మాంసం దుకాణాల ముందు ‘హలాల్ మాంసం’ లేదంటే ‘ఝట్కా మాంసం’ అని కచ్చితంగా బోర్డులు పెట్టాలి. అధికారికంగా నమోదు చేసుకున్న రెస్టారెంట్లకు ఈ విషయమై లేఖలు పంపిస్తాం’’ అని అన్నారు.

తినేదేంటని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది: నరేంద్ర చావ్లా

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ) ఓ ప్రతిపాదనను ఆమోదించింది. దక్షిణ ఢిల్లీ పరిధిలోని అన్ని రెస్టారెంట్లలో వండుతున్న మాంసం హాలాల్‌దా లేదంటే ఝట్కాదా అనే విషయం స్పష్టం చేయాలనే ప్రతిపాదనకు ఎస్‌డీఎంసీ సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం ఎస్‌డీఎంసీలో సభాపక్ష నేత నరేంద్ర చావ్లా మాట్లాడుతూ ‘‘తాము ఏం తింటున్నాం? అదెలా వస్తోందని తెలుసకునే హక్కు ప్రజలకు ఉంది. రెస్టారెంట్లు, మాంసం దుకాణాల ముందు ‘హలాల్ మాంసం’ లేదంటే ‘ఝట్కా మాంసం’ అని కచ్చితంగా బోర్డులు పెట్టాలి. అధికారికంగా నమోదు చేసుకున్న రెస్టారెంట్లకు ఈ విషయమై లేఖలు పంపిస్తాం’’ అని అన్నారు.

Updated Date - 2021-01-21T22:57:08+05:30 IST