Advertisement
Advertisement
Abn logo
Advertisement

జిల్లాకేంద్రంలో ఉత్సాహంగా ఫుట్‌బాల్‌ పోటీలు

సుభాష్‌నగర్‌, అక్టోబరు 13: జిల్లాకేంద్రంలోని రాజారాం స్టేడియం లో కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ వాహిద్‌ మెమోరియల్‌ ఇన్విటేషన్‌ ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించిన ఫుట్‌బాల్‌ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయస్థాయి ఆటగాళ్లు జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. గుగులోత్‌ సౌమ్య, రిషిక ఎంతో పేరు తెచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గు ణ, కార్యనిర్వహక కార్యదర్శి నరాల సుధాకర్‌, కోచ్‌ నాగరా జు, ఫుట్‌బాల్‌ అసొసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు షకిల్‌, ఒ లంపిక్‌ అసొసియేషన్‌ జిల్లా కార్యదర్శి లింగం, సాయాగౌ డ్‌, సుబ్బారావు, ప్రశాంత్‌, జావెద్‌, తదితరులు న్నారు.
హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ జట్ల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. హోరాహోరిగా సాగిన పోటిలో 3-0తో హైదరాబాద్‌ జట్టు ఘన విజయం సాదించింది. రెండో మ్యాచ్‌లో మద్యప్రదేశ్‌, చెన్నై మధ్య సాగిన మ్యాచ్‌లో చెన్నై 6-0 తేడాతో గెలిచింది. 3వ మ్యాచ్‌ కేరళ, మహారాష్ట్ర మధ్య హోరాహోరీగా సాగిన పోటీలో 2-2తో కేరళ గెలిచింది. 4వ మ్యాచ్‌లో నిజామాబాద్‌కు చెందిన కేర్‌ అకాడమీ, బెంగళూరు జట్ల మధ్య పోటీ సాగింది.

Advertisement
Advertisement