అలరించిన కవి సమ్మేళనం

ABN , First Publish Date - 2022-08-16T05:30:00+05:30 IST

స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా

అలరించిన కవి సమ్మేళనం
ప్రశంసా పత్రాలు అందుకుంటున్న కవులు

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, ఆగస్టు 16 : స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగిన కవిసమ్మేళనం ఆహుతులను అలరించింది. సాంస్కృతిక కళాసారథులచే నిర్వహించిన కవిసమ్మేళన కార్యక్రమంలో 26మంది కళాకారులు పాల్గొని తమ కవితలు వినిపించారు. కళాసారథి కళాకారులు తమ పాటలతో కవిసమ్మేళనాన్ని అలరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు మాట్లాడుతూ ఎంతో మంది యోధుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలంతా వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఆగస్టు15న జెండావందనం చేసి స్వాతంత్య్ర దినోత్స వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించి  సోమవారం సామూహిక జాతీయగీతాలాపన చేశామని చెప్పారు. వేడుకల్లో భాగంగానే  కవిసమ్మేళనం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. కవులంతా తమ కవితాగానంతో ఆహ్వానితులను అలరించారని కొనియాడారు. డీఆర్వో హరిప్రియ మాట్లాడుతూ భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కవిసమ్మేళనంలో 26మంది పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా జేసీ తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియ 26మంది కవులను శాలువాలతో సన్మానించి ప్రశంసా పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌లోని వివిధశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, ఏవో ప్రమీల పాల్గొన్నారు.  కవులు గుంటా మనోహర్‌రెడ్డి, దశరథరామయ్య, టి.గోపాల్‌, జనువాడ రామస్వామి, వడ్ల నర్సింహాచారి, పున్న విజయలక్ష్మి, భవానీజగదీశ్వర్‌రెడ్డి, ఘనపురం పరమేశ్వర్‌, ఆకుల మల్లిఖార్జున్‌, గోరెంక నవీన్‌, కంతి మల్లేష్‌, శంకర్‌జీ డబీకార్‌, విజయశ్రీ, గడ్డం చిలుకయ్య, డాక్టర్‌ మలుగు అంజయ్య, శావధాని రాపోలు వెంకటేశం, జీవనజ్యోతి, కట్టగోపాల్‌, కె.నాగేశ్వర్‌రావు, కె.నరేంద్ర, నందుటి అశోక్‌గౌడ్‌, గట్టు మనోహర్‌రెడ్డి, టి,ఆశీర్వాదం, జాజి, ఎం.రాజేశ్వరి పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-16T05:30:00+05:30 IST