Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్రేక్‌ఫాస్ట్‌లో ఎనర్జీ జ్యూస్‌!

ఫిట్‌నెస్‌ రహస్యాలతో పాటు  తమ చర్మసంరక్షణ గురించి విశేషాలను సెలబ్రిటీలు సోషల్‌మీడియా వేదికగా తరచూ అభిమాలనులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా బాలీవుడ్‌ నటి హీనాఖాన్‌ ఆమె రోజూ ఉదయాన్నే తాగే ఎనర్జీ డ్రింక్‌, తన రోజు మొదలయ్యే తీరు గురించి వివరించారిలా...


‘‘ఉదయాన్నే నిద్ర లేవగానే కొద్దిసేపు స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేస్తా. తరువాత నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగుతాను. కాసేపయ్యాక కప్పు బుల్లెట్‌ప్రూఫ్‌ కాఫీ (కప్పు వేడినీళ్లలో ఒకటిన్నర టేబుల్‌ స్పూను కాఫీ, టేబుల్‌ స్పూను నెయ్యి కలిపి బుల్లెట్‌ప్రూఫ్‌ కాఫీ తయారుచేస్తారు)తాగుతా. నా చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండేందుకు టీ ట్రీ ఆయిల్‌తో కూడిన ఫేస్‌వా్‌షతో ముఖం కడుక్కుంటా. ఆ తరువాత సీరమ్‌ రాసుకుంటా. బ్రేక్‌ఫా్‌స్టలో బీట్‌రూట్‌ క్యారెట్‌ జ్యూస్‌ తీసుకుంటా. ఈ జ్యూస్‌ నన్ను ఆరోగ్యంగా, అందంగా ఉంచుతుంది.  


జ్యూస్‌ ఎలా తయారు చేసుకోవాలంటే... 

బీట్‌రూట్‌, క్యారెట్‌, యాపిల్‌ ఒకటి చొప్పున తీసుకొని ముక్కలుగా కోయాలి. ప్రిజ్‌లో ఉంచిన అరటిపండు, సగం కప్పు నీళ్లు, రెండు టేబుల్‌స్లూన్ల నానబెట్టిన చియా గింజలు తీసుకోవాలి. వీటన్నింటిని మిక్సీలో వేసి జ్యూస్‌ పట్టుకోవాలి. అంతే ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచే జ్యూస్‌ రెడీ.’’.

Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...